ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి మూడు నెలల ముందే ఓ రైల్వే అధికారి ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ లో లోపాలపై రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ లోపాలను సరిచేయకపోతే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని అందులో ఆయన హెచ్చరించారు.

ఒడిశా రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 275 మంది చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది. ఇది మానవ తప్పిదమా లేక ఉద్దేశ పూర్వకంగా చేసిన దుశ్చర్యా అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే డిపార్ట్ మెంట్ ఇప్పటికే కోరింది. అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందనే విషయాన్ని వారే తేల్చనున్నారు.

రైల్వేలో తిరిగి విధుల్లోకి చేరిన రెజ్లర్లు.. ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదంటూ వ్యాఖ్యలు

కాగా.. ఈ ప్రమాదం జరగడానికి మూడు నెలల ముందే రైలు భద్రతపై రైల్వే బోర్డుకు సీనియర్‌ రైల్వే అధికారి ఒకరు లేఖ రాశారు. ప్రస్తుతం యూపీలోని లక్నోలో విధులు నిర్వహిస్తున్న హరిశంకర్‌ వర్మ అనే అధికారి తన లేఖలో ఓ ప్రమాదం గురించి ప్రస్తావించారు. తక్షణమే దానిని లోపాలను సరిచేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆయన లేఖను బోర్డు పట్టించుకోలేదు. ఈ అధికారి లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ విషయాన్ని గమనించి సదరు అధికారితో చర్చించారు.

దేశ ప్రతిష్ట రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు - బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జనరల్ అయిన హరిశంకర్ వర్మ.. దాదాపు మూడు సంవత్సరాలుగా సౌత్ వెస్ట్రన్ రైల్వేలో విధులు నిర్వహిస్తున్నారు. హరిశంకర్ వర్మ అక్కడ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ (పీసీఎం)గా ఉన్నప్పుడు కొన్ని రైళ్లు రాంగ్ ట్రాక్‌లో నడుస్తున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ పరిస్థితికి తొలుత స్టేషన్‌మాస్టర్‌ను బాధ్యులను చేశారు. అయితే పదే పదే ఇలా జరగడం చూసి వర్మ స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈసారి ఫిబ్రవరి 8న బెంగళూరు-న్యూఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ రాంగ్ ట్రాక్‌లో వెళ్లింది. అయితే లోకో పైలట్ అప్రమత్తంగా ఉండి, రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

విద్యార్థినులపై నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. విజయవాడలో ఆందోళన చేపట్టిన బాలికలు

ఎందుకు ఇలా జరిగిందని ఆయన కనుక్కున్నారు. ఇంటర్‌లాకింగ్ కోసం రూపొందించిన యంత్రాంగంలో లోపాలు ఉన్నాయని, దీన్ని వెంటనే నిలిపివేయాలని రైల్వే బోర్డుకు లేఖ రాశారు. బైపాస్ గా మార్చినప్పుడు లోకేషన్ బాక్సులో గందరగోళమైన పరిస్థితి తలెత్తిందని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. కాగా.. ఆయన ఈ లేఖ రాసినప్పటికీ రైల్వే బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోయింది.

Scroll to load tweet…

ఈ లేఖ విషయాన్ని టీఎంసీ ప్రస్తావిస్తూ ప్రభుత్వం విమర్శలు చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంటర్‌లాకింగ్ వైఫల్యం కారణంగా ప్యాసింజర్, గూడ్స్ రైలు మధ్య క్రాష్ జరిగి ప్రాణనష్టానికి దారితీసే సిస్టమ్ వైఫల్యం గురించి హెచ్చరించిన ఈ లేఖను రైల్వే ఎందుకు విస్మరించింది?’’ అని ఆయన ప్రశ్నించారు.