బెంగళూరులో దారుణం.. వీడియో కాల్ లో భార్యను చూపించలేదని సహోద్యోగిపై కత్తితో దాడి..
సహోద్యోగి భార్యను వీడియో కాల్ లో చూపించలేదని ఓ వ్యక్తి అతడిని దారుణంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. వీడియో కాల్ లో భార్యను చూపించలేదని సహోద్యోగిని ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని సహచరులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపింది.
ఆమెను పోలిన మహిళను చంపేసి తానే మరణించినట్టు నమ్మించింది.. ఎందుకంటే?
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసించే సురేష్ వర్మ, కోరమంగళ సమీపంలోని వెంకట్ పురలో నివసించే రాజేష్ మిశ్రాలు ఓ దుస్తుల దుకాణంలో టైలర్-కమ్-సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నారు. అయితే సోమవారం మిశ్రా తన భార్యతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడు. అయితే ఈ సమయంలో సురేష్ వచ్చి అతడి భార్యను చూపించాలని అడిగాడు. దీనికి మిశ్రా నిరాకరించాడు.
ధన్‌బాద్ అగ్నిప్రమాదం : బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల సహాయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ...
దీంతో ఇరువురి మధ్య గొడవకు దారి తీసింది. ఇది తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో సురేష్ మిశ్రాను కత్తెరతో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారపోయాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆ షాపులో ఉన్న ఇతర సహోద్యోగులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సురేశ్‌పై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్లు 324, 524 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తరువాత నిందితుడిని అదే రోజు అరెస్టు చేశారు.
తండ్రిపై కొడుకు పాశవిక దాడి... కలపకోసే యంత్రంతో చేతివేళ్లు, పురుషాంగం కోసి...
అనంతరం సురేష్ బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా గతేడాది డిసెంబర్‌లో బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈవ్ టీజింగ్‌ను వ్యతిరేకించిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో బాధితుడు మరణించాడు. అతడిని పోలీసులు కృష్ణగా గుర్తించారు. దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలోని టకియా పంచాయతీలో పాఠశాలకు వెళ్లే బాలికలతో స్థానిక ముస్లిం యువకులు ఈవ్ టీజింగ్ చేస్తుండగా కృష్ణ అడ్డుకున్నారు. దీంతో అతడిపై నిందితులు దాడి చేశారు.