Asianet News TeluguAsianet News Telugu

ఆమెను పోలిన మహిళను చంపేసి తానే మరణించినట్టు నమ్మించింది.. ఎందుకంటే?

ఓ మహిళ తనను పోలిన వ్యక్తిని గాలించి వెతికి పట్టుకుని మరీ చంపేసింది. ఓ పురుషుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. తాను స్వయంగా మరణించినట్టు నమ్మించడానికి ఈ హత్య చేసిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
 

woman fake her own death in germani killing lookalike woman
Author
First Published Jan 31, 2023, 9:35 PM IST

న్యూఢిల్లీ: ఓ జర్మన్-ఇరాకీ మహిళ తనను పోలిన మహిళను చంపేసింది. తానే మరణించినట్టు లోకాన్ని నమ్మించాలని ప్రయత్నించి విఫలమైంది. జర్మనీలో జరిగిన ఈ ఘటన తొలిసారి గతేడాది వెలుగులోకి వచ్చింది. కీలక విషయాలు ఇటీవల బయటపడ్డాయి.

23 ఏళ్ల మహిళ మృతదేహం బవేరియా టౌన్‌లో ఓ కారులో ఆగస్టు నెలలో బయటపడింది. మృతదేహం పై చాలా కత్తి గాట్లు ఉన్నాయి. తొలుత బాధితురాలే ఆ కారుకు యజమాని అని అనుకున్నారు. కానీ, తర్వాతి రోజు ఆ మృతదేహం, కారు యజమాని ఇద్దరూ వేరు అని గుర్తించారు. మరణించిన మహిళ.. కారు యజమానిని పోలి ఉన్నదని గమనించారు.

23 ఏళ్ల జర్మన్-ఇరాకీ మహిళ, 23 ఏళ్ల కోసోవాన్ అనే పురుషుడు కలిసి ఆమెను పోలిన మహిళల కోసం సోషల్ మీడియాలో కొన్నాళ్లపాటు వెతికారు. చాలా మందిని కలవడానికి ప్రయత్నించారు. బ్యూటీషియన్‌గా చేసే ఆ మహిళ రకరకాల కాస్మెటిక్స్ అందిస్తానని చెప్పి పలువురిని ప్రలోభపెట్టి కలువాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. ఇదే రీతిన బాధితురాలిని వీరిద్దరు కలుసుకుని.. ఆమెను పికప్ చేసుకోవడానికి వీరే కారులో వెళ్లారు. ఆమెతోపాటు తిరిగి వస్తుండగా అటవీ ప్రాంతంలో కారును ఆపేసి ఆమెను కిందికి దింపి కత్తులతో పొడిచి చంపారు. ఆ తర్వాత కారులోనే ఆమెను వీరు నివసించే ప్రాంతానికి తీసుకువచ్చి వదిలి పెట్టి వెళ్లిపోయారు. 

Also Read: ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది తల తెగిపడింది.. మసీదులో లభ్యం: పాకిస్తాన్ పోలీసులు

అయితే, నిందితురాలు తనను పోలిన మహిళ కోసం గాలించడం, అలాంటి మహిళను చంపేయడం వంటి అంశాలను పరిశీలిస్తే నిందితురాలు తానే మరణించినట్టు నమ్మించాలని అనుకుని ఉంటుందని ఇప్పుడు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారని పోలీసులు తెలిపారు. బహుశా నిందితురాలు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికే ఈ దుస్సాహసానికి పాల్పడి ఉంటుందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios