తండ్రిపై కొడుకు పాశవిక దాడి... కలపకోసే యంత్రంతో చేతివేళ్లు, పురుషాంగం కోసి...
తండ్రిమీద దాడిచేసి పురుషాంగాన్ని, చేతివేళ్లను కత్తిరించాడో దుర్మార్గుడు. తాగిన మైకంలో స్నేహితులతో కలిసి కుటుంబ గొడవల కసి తీర్చుకున్నాడు.

ఉత్తరాఖండ్ : ఓ కొడుకు తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్ధంసింగ్ నగర్ లో చోటుచేసుకుంది. ఉద్ధంసింగ్ నగర్ జిల్లా కాశీపూర్ పట్టణంలోని ఓ కొడుకు తండ్రి మీద పట్టరాని ఆవేశంతో దాడి చేశాడు. ఈ దాడిలో తండ్రి ఎడమ చేతి వేళ్లను, పురుషాంగాన్ని కోసేశాడు. ఈ ఘటనలో బాధితుడు సోదరుడు సహాయంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొంది.. కోలుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కోసం గాలిస్తున్నారు.
బాధితుడు ఫిర్యాదులో తన మీద జరిగిన దాడి గురించి పేర్కొంటూ.. తన కొడుకు అర్పిత్ ఆర్మీలో పనిచేస్తున్నాడని తెలిపాడు. డిసెంబర్ 26న అతనితోపాటు స్థానికంగా ఉండే రాహుల్ సైని, రోహిత్ వర్మ, ఇంకొకరు కలిసి తనపై దాడి చేశారని తెలిపాడు. ఆ సమయంలో వారంతా తాగి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్థానికంగా ఉన్న కచనాల్ గాజీ కుమావూన్ కాలనీలో తనపై ఈ పాశవిక దాడి జరిగింది అని తెలిపాడు.
పోలీసులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య ఎన్ కౌంటర్.. ముఠాలోని నలుగురు సభ్యుల అరెస్ట్
ఈ దాడి సమయంలో ముగ్గురు వ్యక్తులు తన కాళ్లు చేతులు, నోరు నొక్కి పట్టుకున్నారని.. కలపకోసే పరికరంతో నాలుగో వ్యక్తి తన మీద దాడికి దిగినట్లు వివరించాడు. దాడితో తీవ్ర రక్తస్రావంతో తాను స్పృహ తప్పి పడిపోయానని.., ఆ సమయంలో నిందితులు పారిపోయినట్లు చెప్పారు. దీని గురించి కాశీపూర్ ఎస్పీ అభయ్ సింగ్ మాట్లాడుతూ..ఈ దాడి కుటుంబ గొడవల కారణంగా జరిగినట్లుగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.