దారుణం.. ‘భాయ్’ అని పిలవలేదని ఇద్దరిని హతమార్చిన గ్యాంగ్ స్టర్..
‘భాయ్’ అని పిలవలేదని ఓ గ్యాంగ్ స్టర్, అతడి అనుచరులు ఇద్దరు వ్యక్తులను దారుణంగా హతమార్చారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగింది. నిందితుడికి కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

ఢిల్లీలో దారుణం జరిగింది. ‘భాయ్’ అని పిలవలేదని ఓ గ్యాంగ్ స్టర్, అతడి అనుచరులు కలిసి ఇద్దరు వ్యక్తులను ఘోరంగా హతమార్చాడు. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులను ఒకే వర్గానికి చెందిన రఘు, భూరాగా గుర్తించారు. ‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పుదుచ్చేరి ఏకైక మహిళా ఎమ్మెల్యే, మంత్రి రాజీనామా.. కులతత్వం, లింగవివక్షే కారణం..
వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో రవికాంత్ అలియాస్ దబ్లూ నివసిస్తున్నాడు. అతడిని కలిసేందుకు రఘు, భూరా, వారి అనుచరులు సోమవారం అశోక్ విహార్ కు వచ్చారు. వారందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అయితే ఈ సమయంలో దబ్లూను ‘దబ్లూ’ భాయ్ అని పిలిచేందుకు రఘు నిరాకరించాడు. ఈ కారణంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది.
ఓబీసీ, దళిత, గిరిజనుల వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కుల గణన అవసరమే - రాహుల్ గాంధీ
దీంతో సహనం కోల్పోయిన రఘు దబ్లూను గన్ తో కాల్చాడు. దీనిని చూసిన డబ్లూ అనుచరులు కూడా రఘుపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అలాగే భూరాను కూడా దబ్లూ అనుచరులు కత్తితో పొడిచ చంపారు. అయితే ఈ ఘర్షణలో దబ్లూకు కూడా గాయాలు అయ్యాయి. అతడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్ కు భారత్ అండగా ఉంటుంది - నెతన్యాహుతో ఫోన్ లో ప్రధాని నరేంద్ర మోడీ..
కాగా.. రఘు, భూరా, దబ్లూలపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఈ ముగ్గురి పేర్లతో మరో కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, మిగతా నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని పేర్కొన్నారు.