ఓబీసీ, దళిత, గిరిజనుల వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కుల గణన అవసరమే - రాహుల్ గాంధీ
అణగారిన వర్గాల అభ్యున్నతి జరగాలంటే అది కుల గణనతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన తప్పకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

దేశంలో కుల గణన తప్పకుండా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దీని వల్ల అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మధ్యప్రదేశ్ కు వెళ్లిన రాహుల్ గాంధీ కుల గణన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన కుల గణను వెనుకబడిన తరగతుల (ఒబీసీ). దళితుల, గిరిజన వర్గాల నిజమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులను వెల్లడించే ‘ఎక్స్-రే’గా అభివర్ణించారు. ఆందోళనలను పరిష్కరించడానికి, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి కుల ఆధారిత డేటాను సేకరించడం ప్రాముఖ్యతను ఎత్తి చూపే ప్రయత్నాలలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ రంగంలోనూ లింగ న్యాయం జరగాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓబీసీ, ఎస్సీల వాటాను నిర్ణయించడం దేశానికి అత్యంత కీలకమని అన్నారు. కుల గణనను నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, దానిని విజయవంతంగా అమలు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ఓబీసీ, ఎస్సీ వర్గాలకు ఎంత వాటా ఇవ్వాలి? ఇదీ దేశం ముందున్న ప్రశ్న. అందుకే మేము కుల గణనకు పిలుపునిచ్చాం. మేము దానిని పూర్తి చేస్తాం’’ అని ఆయన అన్నారు.
షోపియాన్ లో ఎన్ కౌంటర్.. కాశ్మీర్ పండిత్ హత్య కేసులో ఉగ్రవాది సహా మరొకరు హతం..
తన ప్రసంగంలో రాహుల్ గాంధీ కుల గణను సమర్థించడంతో పాటు బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు ఆదివాసీలను అగౌరవపరిచారని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రయోగశాలలో ఆ పార్టీ నేతలు ఆదివాసీలపై మూత్ర విసర్జన చేస్తున్నారన్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ-ఆరెస్సెస్ ప్రయోగశాల నిర్మిస్తామని అద్వానీ చెప్పారని, దాని అర్థం ఇదే అని అన్నారు.
నెరవేరిన లతా మంగేష్కర్ చివరి కోరిక.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన కుటుంబం..
‘‘బీజేపీ-ఆరెస్సెస్ అసలు ప్రయోగశాల గుజరాత్ లో లేదని, మధ్యప్రదేశ్ లో ఉందని లాల్ కృష్ణ అద్వానీ ఒక పుస్తకం రాశారు. బీజేపీ ప్రయోగశాలలో చనిపోయిన వారికి చికిత్స చేస్తున్నారు. వారి డబ్బు దొంగిలించబడుతోంది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.