దారుణం.. రన్నింగ్ కు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం..
Gang rape : రన్నింగ్ ప్రాక్టీస్ చేసేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెను అడ్డగించి, బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Gang rape : ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా పంజాబ్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రన్నింగ్ వెళ్లిన 15 ఏళ్ల బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తెలంగాణ కొత్త ఎమ్మెల్యేల్లో 80 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా ఎవరిపై ఉన్నాయంటే ?
వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక అథ్లెటిక్ గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం ఆమె రెగ్యులర్ గా రన్నింగ్ కు వెళ్తుంటుంది. ఈ క్రమంలో నవంబర్ 30వ తేదీన కూడా ఎప్పటిలాగే రన్నింగ్ కోసం బయటకు వెళ్లింది. అయితే ఆ సమయంలో నలుగురు యువకులు బాలికను అడ్డగించారు.
పరిగెత్తకుండా నిలువరించారు. అనంతరం బలవంతంగా మద్యం తాగించారు. బాలికకు మత్తు ఎక్కిన తరువాత సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తరువాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై బాలిక పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో పోలీసులు నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో పాటు చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గత నెలలో యూపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై పలువురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత యువతి ఆగ్రాలోని హోటల్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను పలువురు దుండగులు ఓ సంపన్న హోమ్ స్టేకు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనలో ఒక మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.