నాగాాలాండ్ లో భద్రతా దళాల కాల్పుల ఘటనలో జవాన్లను, అధికారులను విచారించడానికి సిట్ కు ఆర్మీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు వర్గాలు వివరాలు వెల్లడించాయి. ఈ నెల 4వ తేదీన జరిగిన ఘటనలో 14 మంది చనిపోయారు.

డిసెంబ‌ర్ 4వ తేదీన నాగాలాండ్ లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో ఉగ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై కాల్పులు జరపడంతో 14 మంది పౌరుల చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో ఆకస్మిక దాడిలో పాల్గొన్న అధికారులు, జవాన్ల వాంగ్మూలాలను పరిశీలించడానికి, న‌మోదు చేయ‌డానికి నాగాలాండ్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు అనుమతి ఇవ్వడానికి సైన్యం అంగీకరించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆగ్రహంతో జవాన్లను చుట్టుముట్టిన గ్రామస్తుల దాడిలో ఒక సైనికుడు మరణించాడు. నాగాలాండ్ సిట్ ఈ వారంలో 21 పారా స్పెషల్ ఫోర్సెస్ జవాన్ల వాంగ్మూలాలను రికార్డ్ చేసే అవకాశం ఉందని పోలీసు ఉన్నత వర్గాలు తెలిపాయి. 

ఏడు బృందాలుగా సిట్‌..
నాగాలాండ్ కాల్పుల ఘ‌ట‌న‌లో విచారణ జ‌రిపేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే దానిని వేగ‌వంతం చేసేందుకు ఎనిమిది మంది సభ్యుల నుండి 22 మంది అధికారులకు విస్త‌రించింది. ఇందులో ఒక బృందంలో ఒక ముఖ్య‌మైన బృందంలో ఐదుగురు ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులు ఉంటారు. మిగితా ఏడు బృందాల్లో వివిధ స్థాయిల అధికారులు ఉంటారు. 

అఖిలేష్ యాదవ్ రథయాత్ర.. హనుమాన్, గద, అంబేద్కర్‌ల చిత్రాలతో హల్‌చల్

ఏం జ‌రిగిందంటే..
డిసెంబ‌ర్ 4వ తేదీన నాగాలాండ్‌లోని మోన్ జిల్లా తిరు-ఓటింగ్ రహదారి వెంబడి వస్తున్న ఒక ట్రక్కులో 21 పారా స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ హంటింగ్ రైఫిల్‌ను చూసినట్లు భావించింది. వారు ఎన్‌ఎస్‌పీఎన్ మిలిటెంట్లుగా భ‌ద్ర‌తా దళాలు అనుమానించి కాల్పులు జ‌రిగిపింది. దీంతో ఈ ట్రక్కులో ఉన్న ఆరుగురు బొగ్గు గని కార్మికులు మరణించారు. గాయపడిన మరో ఇద్దరిని సైన్యం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థులు అక్కడికి చేరుకుని సైనికులపై కొడవళ్లతో దాడి చేశారు. ఈ క్ర‌మంలో వారిలో ఒకరి గొంతు కోసుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మొత్తం ఈ ఘ‌ట‌న‌లో 14 మంది పౌరులు మృతి చెందారు.

AFSPA చ‌ట్టాల ర‌ద్దు కోసం పెరిగిన ఆందోళ‌న‌లు..
నాగాలాండ్‌లో AFSPA ఉపసంహరణ కోసం ఆందోళ‌న‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు చేప‌డుతున్నాయి. నాగాలాండ్ తో పాటు ఈశాన్య భారతంలో భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాల‌ను ఈ AFSPA చ‌ట్టం క‌ల్పిస్తుంది. ఈ చ‌ట్టాల వ‌ల్ల సాధార‌ణ పౌరుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయ‌నే ఆరోప‌ణలు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఈ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఈశాన్య రాష్ట్రాల ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఈ నాగాలాండ్ లో ఈ కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత ఈ నిర‌స‌న‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారకుండా మోన్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. దీంతో పాటు టెలికాం సేవలపై ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సైతం నిలిపివేశారు. అయినప్పటికీ ప్రజలు తమ నిరసన గొంతుకను వినిపించారు.

బిహార్‌లో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైంది: సీఎం నితీష్ కుమార్

ఈ నిర‌స‌న‌లు మోన్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వ్య‌క్త‌మ‌య్యాయి. రాష్ట్ర‌మంతా AFSPA ర‌ద్దు చేయాల‌ని ఫ్ల‌కార్డులు వెలిశాయి. దీంతో నాగాలాండ్ ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది. ఈ వారం ప్రారంభంలో హోం మినిస్ట‌ర్ అమిత్‌షాతో సీఎం నీఫియు రియో స‌మావేశం అయ్యారు. AFSPA ఉపసంహరణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది మణిపూర్‌లో అసెంబ్లీకి ఎన్నిక‌లు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కూడా ఈ చ‌ట్టం అమ‌లులో ఉంది. ఈ నేప‌థ్యంలోనే AFSPAని తొలగించడం పెద్ద రాజకీయ సమస్యగా మారింది.