బిహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు దడ పుట్టిస్తుండగా ఆయన తమ రాష్ట్రంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైందని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందు కోసం వైద్య సిబ్బంది అనేక రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారని, అవసరమైన సదుపాయాలను సమకూర్చుకుంటున్నారని తెలిపారు.
పాట్నా: దేశవ్యాప్తంగా కరోనా(Coronavirus) కలకలం పెరుగుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)తో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షల(Restrictions)ను అమలు చేస్తున్నాయి. యూకే, యూఎస్ సహా పలు దేశాల్లో ఇప్పటికే కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బిహార్ CM Nitish Kumar సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్(Bihar)లో కరోనా వైరస్ థర్డ్ వేవ్(Third Wave) మొదలైందని అన్నారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందు కోసం వైద్య సిబ్బంది అనేక రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారని, అవసరమైన సదుపాయాలను సమకూర్చుకుంటున్నారని తెలిపారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లలో వైద్యుల సేవలు అమోఘమని సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ వేవ్ కోసం కూడా వైద్యుల సహాయ సహకారాలు కీలకమని, విస్తృతంగా సేవలు అందించాలని కోరారు. ఈ నెల 25వ తేదీన సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలకు ఇవి భిన్నంగా ఉన్నాయి. బిహార్‌లో మంగళవారం కరోనా కొత్త కేసులు 47 నమోదయ్యాయి. అయితే, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ కాలేదు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఆంక్షల బాటలోకి వెళ్తున్నాయి. ఇదే విషయాన్ని సీఎం నితీష్ కుమార్ ముందు విలేకరులు ప్రస్తావించారు. దీనికి సమాధానంగా తమ రాష్ట్రంలో ఆంక్షలు విధించాల్సిన అవసరం ఇప్పుడైతే లేదని తెలిపారు. అయితే, బిహార్ పొరుగు రాష్ట్రం యూపీలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.
Also Read: Omicron Cases in India: భారత్‌లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తామని, అన్ని అవసరాలను సమకూర్చుకుంటామని సీఎం నితీష్ అన్నారు. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు పార్కులపై నిషేధం విధించారు. పార్కుల్లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. తద్వారా మంది గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.కరోనా కట్టడిలో భాగంగా ఎలాంటి సభలు సమావేశాలనూ ప్రోత్సహించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతి, మతపరమైన వేడుకలు, సభలు వద్దని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం వివరాల ప్రకారం, బిహార్‌లో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా రిపోర్ట్ కాలేదు.
Also Read: Coronavirus: దేశంలో కరోనా కల్లోలం.. ముంబయిలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం కేసుల పెరుగుదల
దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781కి చేరింది. దేశంలోని మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 241 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వివరాలను వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 Omicron Cases నమోదు కాగా, 161 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే.. గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్తాన్‌లో 46, కర్ణాటకలో 34, తమిళనాడులో 34, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఒడిశాలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూ కశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 1 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
