ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నది. కాంగ్రెస్ కూడా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా బీఎస్పీ ప్రచారం అంతంతగానే ఉన్నది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తాజాగా రథ యాత్ర చేపట్టారు. ఈ రథ యాత్రలో పార్టీ కార్యకర్తలు ఆయనకు హనుమాన్ చిత్రపటాన్ని, గదను, అంబేద్కర్ బొమ్మలను అందించారు. అవి తీసుకుంటున్న అఖిలేష్ యాదవ్ ఫొటోలపై చర్చ జోరుగా జరుగుతున్నది. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్నాయి. ఎన్నికలు సమీపించడంతో పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయాయి. ఇక్కడ అధికార బీజేపీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల బరిలో నిలిచి పోరాడనున్నాయి. బీజేపీ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలతో అధికారాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ తాము అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి వల్లెవేస్తున్నది. దీనికితోడు అఖిలేష్ యాదవ్ రథ యాత్రకు శ్రీకారం చుట్టాడు. కాంగ్రెస్ కూడా బలంగా ప్రచారం చేస్తున్నది. బీఎస్పీ ప్రచారం పెద్దగా కనిపించడం లేదు. తాజాగా, అఖిలేష్ యాదవ్ చేపడుతున్న రథ యాత్రకు విశేష స్పందన వస్తున్నది. అత్యాచారం కారణంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉన్నావ్‌లో ఆయన యాత్రకు మంచి ఆదరణ వచ్చింది. పార్టీ కార్యకర్తల నుంచి ఆయనకు చాలా బహుమానాలు వస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో రథ యాత్రలకు చాలా ప్రాధన్యత ఉంటుంది. ఇలాంటి రథ యాత్రతోనే బీజేపీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 1990లలో ఎల్‌కే అద్వానీ ఉత్తరప్రదేశ్‌లో చేసిన రథ యాత్ర బీజేపీకి అనూహ్య మద్దతును తెచ్చిపెట్టింది. మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా తాజాగా రథ యాత్ర చేపడుతున్నారు. ఈ రథ యాత్రకు విశేష స్పందన వస్తున్నది. చాలా మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు బహుమనాలు అందించారు. వాటిని అఖిలేష్ యాదవ్ స్వయంగా తీసుకున్నారు. ఈ బహుమానాల్లో చాలా మందిని ఆకర్షించింది.. హనుమాన్ చిత్రపటం. ఓ వ్యక్తి హనుమాన్ చిత్రపటాన్ని అందిస్తుండగా అఖిలేష్ యాదవ్ తీసుకుంటున్న ఫొటోపై చర్చ జరుగుతున్నది. ఆ చిత్రపటంలో పార్టీ కార్యకర్త పేరుతోపాటు సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కూడా కనిపిస్తున్నది.

Scroll to load tweet…

Also Read: Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల వాయిదాకు అవ‌కాశం లేదు !

మరో ఫొటోలో అఖిలేష్ యాదవ్ గదను పట్టుకుని కార్యకర్తల వైపు చూస్తున్నారు. ఆ వాహనం బాల్కనీ నుంచి ముందుకు వంగి గదను ఎడమ చేతిలో పట్టుకుని ముందుకు వెనక్కి తింపారు. రథ యాత్రకు హాజరైన జనాలను ఉత్సాహపరిచారు. మరో చిత్రంలో ఆయనకు ఓ వ్యక్తి అంబేద్కర్ చిన్న ప్రతిమను అందజేశారు.

అఖిలేష్ యాదవ్ సెక్యూలర్ లీడర్‌గా చాలా మందికి తెలుసు. అయితే, ఆ గుర్తింపును ముస్లిం మద్దతుదారుడిగా బీజేపీ ఆరోపణలు చేసింది. అఖిలేష్ యాదవ్ ముస్లిం మద్దతుదారుడని ప్రచారం చేసింది. ఈ ప్రచారం సమాజ్‌వాదీ పార్టీని దెబ్బ తీసింది. తద్వార బీజేపీ సులువుగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గింది. అయితే, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ కూడా హిందూ గుర్తింపును స్పష్టం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. తాను సెక్యూలర్ లీడర్‌గా చెప్పుకుంటూనే.. అందరినీ కలుపుకుని వెళ్లే నాయకుడిగా అఖిలేష్ యాదవ్ తరుచూ చెప్పుకుంటుంటారు.

Also Read: ‘ఆడపిల్లను.. పోరాడగలను’.. ప్రియాంక గాంధీ పిలుపుతో మారథాన్ కోసం కదిలిన యూపీ మహిళలు

కోవిడ్‌-19 కొత్త వేరియంట్ కేసులు అధికంగా న‌మోదుకావ‌డంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆలోచించుకోవాల‌ని న్యాయ‌స్థానాలు ఎన్నిక‌ల సంఘానికి సూచిస్తున్నాయి. అయితే, ఒమిక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశంలేదని ఎన్నికల సంఘం (ఈసీ) వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించాయి.