మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ వయస్సు ఎంత అని, ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా అని జర్నలిస్టుపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

రాహుల్ గాంధీ తర్వాత మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో యువతకు ప్రాతినిధ్యం ఎందుకు లేదంటూ ‘ఆజ్ తక్’ జర్నలిస్టు అడితిన ప్రశ్నకు దిగ్విజయ్ సింగ్ సమాధానమిస్తూ.. ‘మోదీ వయసు ఎంత?’ అని ప్రశ్నించారని ‘టైమ్స్ నౌ‘ నివేదించింది.

భారత్‌కు ఆస్కార్, నారీ శక్తి, అవయవదానం: ప్రధాని మోడీ ‘మన్‌ కీ బాత్‌’లో కీలక అంశాలు

దీనికి ఆ జర్నలిస్టు సమాధానమిస్తూ. బీజేపీ యువనేతలకు పెద్దపీట వేస్తోందని, వారే ఆ పార్టీ ముఖమని విలేకరి వ్యాఖ్యానించారు. దీంతో మళ్లీ ఆయన స్పందిస్తూ.. ‘‘శివరాజ్ సింగ్ బీజేపీ ముఖమా? ఆయన వయసెంత?’’ అని అడిగారు. ఆ రిపోర్టర్ తన గౌరవప్రదమైన మీడియా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. మీడియాపై కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోవడంపై దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘మీరు ఎప్పుడైనా మోడీని ప్రశ్నించారా? మోడీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా ?’’ అని ప్రశ్నించారు. 

కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరికి గాయాలు.. కొచ్చిన్ ఎయిర్ పోర్టు సమీపంలోఘటన (వీడియో)

2019లో ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యల కేసులో దోషిగా తేలడం, ఆ తర్వాత లోక్ సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కూడా ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానిమిస్తూ.. ‘‘భయ్యా దేఖియే.. పెహ్లా ఆప్కా అటెంప్ట్ వహన్ సే ఆయా, దుస్రా ఆప్కా అటెంప్ట్ యహన్ సే ఆయయా, తీస్రా ఆప్కా అటెంప్ట్ యహన్ సే ఆయా. ఆప్ ఇత్నే డైరెక్ట్ లీ బీజేపీ కే లియే క్యు కామ్ కర్ రహే హో? (అన్నా చూడండి.. మొదట మీరు నన్ను అక్కడి నుండి (దిక్కు) ప్రశ్న అడగడానికి ప్రయత్నించారు, రెండో సారి ఇక్కడి నుంచి, మళ్లీ మూడో సారి ఇక్కడి నుంచే.. మీరు నేరుగా బీజేపీ కోసం ఎందుకు పని చేస్తున్నారు. ?) తోడి డిస్క్రేషన్ సే కరో యాడ్ (కొంచెం విచక్షణతో చేయండి). ’’ అని అన్నారు. 

మళ్లీ కొంచెం సేపు ఆగి ‘‘దయచేసి మీరు బీజేపీ కోసం పని చేయాలనుకుంటే ఇక్కడ (చాతీ వైపు చేయి చూపిస్తూ) బీజేపీ జెండా గుర్తు తెచ్చి మీ ఛాతీపై పెట్టుకోండి.. అప్పుడు నేను వారికి ఎలా సమాధానం ఇస్తానో అదే విధంగా సమాధానం ఇస్తాను. కానీ ప్రెస్‌మెన్‌గా నటించండి.’’ అని ప్రశ్నించిన జర్నలిస్టును చూసి అన్నారు. కొన్ని సెకెండ్లు ఆగి నవ్వుతూ ‘‘హవా నికాల్ ది?’’ (గాలి వెళ్లిపోయిందా ?) అని అన్నారు. దీంతో అక్కడున్న మిగితా మీడియా ప్రతినిధులు కూడా నవ్వారు. 

అమరుడైన నా తండ్రిని అవమానించారు.. ఆయన కొడుకును మీర్ జాఫర్‌ అని పిలిచారు: బీజేపీపై ప్రియాంక ఫైర్

ఈ మీడియా సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... భారత ప్రజల ప్రజాస్వామిక స్వరాన్ని కాపాడుతూనే ఉంటానని, తాను ఎవరికీ భయపడనని అన్నారు. గౌతమ్ అదానీ డొల్ల కంపెనీలకు వెళ్లిన రూ.20 వేల కోట్లు ఎవరివి అనే సాధారణ ప్రశ్న నుంచి ప్రధాని నరేంద్ర మోడీని రక్షించేందుకు చేసిన డ్రామా ఇదంతా అని అన్నారు. ఈ బెదిరింపులకు, అనర్హతలకు, జైలు శిక్షలకు తాను భయపడబోనని ఆయన తేల్చి చెప్పారు. తాను విదేశీ జోక్యం కోరానని మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని, కానీ తాను అలా అనలేదని అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, దానిని నిరూపించేందుకు అనేక ఉదాహరణలు ఎప్పటికప్పడు వస్తూనే ఉన్నాయని అన్నారు.