Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరికి గాయాలు.. కొచ్చిన్ ఎయిర్ పోర్టు సమీపంలోఘటన (వీడియో)

కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రన్ వేకు సమీపంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యారు. వీరిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. 

Coast Guard helicopter crashed.. Two injured.. Incident near Cochin Airport.. ISR
Author
First Published Mar 26, 2023, 2:26 PM IST

కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెషన్ లో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

అమరుడైన నా తండ్రిని అవమానించారు.. ఆయన కొడుకును మీర్ జాఫర్‌ అని పిలిచారు: బీజేపీపై ప్రియాంక ఫైర్

ట్రైనింగ్ ఫ్లైట్ కోసం నెడుంబస్సేరి విమానాశ్రయం రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే రన్ వేకు  ఐదు మీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో రన్ వేను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను అక్కడి నుంచి తరలించిన వెంటనే రన్‌వే తెరుచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఆయుర్వేద చికిత్సతో క్యాన్సర్ నయం చేస్తామని రూ. 15 లక్షల మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

‘‘ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన ఏఎల్ హెచ్ ధృవ్ మార్క్ 3 హెలికాప్టర్ ను పైలట్లు పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో హెలికాప్టర్ సుమారు 25 అడుగుల ఎత్తులో ఉంది. ఏఎల్ హెచ్ ధృవ్ ఫ్లీట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఐసీజీ కృషి చేస్తోంది’’అని ఐసీజీ అధికారులు తెలిపారు.

కాగా.. ముంబై తీరంలో నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో మార్చి 8 నుంచి ఏఎల్ హెచ్ ధృవ్ హెలికాప్టర్లను నిలిపివేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios