అనారోగ్యంతో మరణించిన కేంద్రమంత్రి అనంతకుమార్‌.. దాదాపు 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చివరి కోరిక మాత్రం తీరలేదు.. పార్టీ పరంగా జాతీయ స్థాయి పదవులను, కీలక కేబినెట్ పదవులను నిర్వహించిన ఆయనకు ముఖ్యమంత్రి కావాలన్నది కల.

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా హైకమాండ్ వద్ద తన వంతు ప్రయత్నాలు చేసేవారు. 1999 నుంచి 2004 మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన సమయంలోనూ ఆయనకు తృటిలో అవకాశం చేజారిపోయింది.

అలాగే తన చివరి రోజుల్లో దేవనహళ్లి సమీపంలోని హెగ్గనహళ్లిలో నివాసం ఉండాలని భావించారు... తన బాల్యాన్ని అక్కడే గడిపిన ఆయన... రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇదే ప్రాంతంలో ఉంటానని తన స్నేహితులు, బంధువులతో చెప్పేవారు... కానీ చివరికి ఆ కోరిక కూడా తీరకుండానే అనంతకుమార్ మరణించారు. కాగా, ఆయన అంత్యక్రియలు నేడు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. 

కేంద్ర మంత్రి అనంతకుమార్ కన్నుమూత

అనంత్‌కుమార్ కన్నుమూత...ఆత్మబంధువుని కోల్పోయా: ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

అనంతకుమార్ మరణం..కర్ణాటకలో మూడు రోజుల సంతాప దినాలు