కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలోని వృద్ధురాలు తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందారు. అయితే ఆమె ను పోలీసు గుర్తించారు. గూగుల్ ట్రాన్స్ లేట్ సాయంతో ఆమె ఏం చెబుతుందో అర్థం చేసుకొని కుటుంబ సభ్యులతో కలిపారు. 

ఉత్తరాఖండ్ లో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన ఓ వృద్ధురాలు గూగుల్ ట్రాన్స్ లేట్ సాయంతో తిరిగి తన కుటుంబ సభ్యులను కలిసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం కేదార్ నాథ్ యాత్రకు వెళ్లింది. అయితే యాత్ర ముగించుకొని తిరిగి అక్కడి నుంచి వస్తున్న సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. 

తానా సాయంతో హైదరాబాద్ కు చేరుకున్న తాటికొండ ఐశ్వర్య మృతదేహం..

ఈ ప్రతికూల వాతావరణం కారణంగా ఆ కుటుంబంలోని 68 ఏళ్ల ఓ మహిళ తప్పిపోయింది. ఆ వృద్ధురాలు గౌరీకుండ్ పార్కింగ్ స్థలంలోనే ఉండిపోయింది. ఎంతో విసుగుతో అక్కడే ఉండిపోయిన వృద్ధురాలిని స్థానిక పోలీసు అధికారులు గుర్తించారు. ఏం జరిగిందని ఆరా తీశారు. ఎక్కడి నుంచి వచ్చారని, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పాలని కోరారు. ఆ వృద్ధురాలికి కూడా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అయినా తాను తన కుటుంబ సభ్యులతో విడిపోయిన సంగతిని వారికి తెలుగులో చెప్పింది.

గోల్డెన్ టెంపుల్ సమీపంలో మళ్లీ బాంబు పేలుడు.. వారం రోజుల్లో మూడో ఘటన

కానీ అక్కడి పోలీసు అధికారులకు తెలుగు రాకపోవడంతో ఆ మహిళ ఏం చెబుతోందో అర్థం కాలేదు. అయితే అక్కడి పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె ఏం చెబుతుందో తెలుసుకునేందుకు గూగుల్ ట్రాన్స్ లేట్ టూల్ సాయం తీసుకున్నారు. పలు ప్రయత్నాల తరువాత ఆమె చెబుతున్నదేంటో పోలీసులకు అర్థమైంది. ఆ తరువాత ఆ టూల్ సాయంతోనే పోలీసులు వృద్ధురాలితో కమ్యూనికేట్ చేయగలిగారు.

మూడేళ్ల కూతురిని కాపాడేందుకు చిరుతపులితోనే పోరాడిన దంపతులు.. ఎక్కడంటే ?

చివరికి ఆ మహిళ నుంచి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ సంపాదించగలిగారు. ఆమె ఇచ్చిన నెంబర్ కు పోలీసులు ఫోన్ చేశారు. పోలీసుల నుంచి ఫోన్ రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. తమ కుటుంబ మొత్తం సోన్ ప్రయాగ్ లో ఉందని, వృద్ధురాలి కోసమే తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. అనంతరం పోలీసులు వృద్ధురాలి కోసం ఓ వాహనం ఏర్పాటు చేసి సోన్ ప్రయాగ్ కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిపారు. ఆ కుటుంబం సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.