టెక్సాస్ లోని ఓ మాల్ జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య  మృతదేహం బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంది. ఆమె  మృతదేహం స్వదేశానికి తీసుకురావడంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కీలక పాత్ర పోషించింది. 

ఈ నెల 6న టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన 27 ఏళ్ల తాటికొండ ఐశ్వర్య మృతదేహం బుధవారం హైదరాబాద్ కు చేరుకుంది. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చిన విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరింది. అయితే అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి మృతదేహాన్ని భారత్ కు పంపినట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధి కొల్ల అశోక్ బాబు అమెరికా నుంచి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు.

మూడేళ్ల కూతురిని కాపాడేందుకు చిరుతపులితోనే పోరాడిన దంపతులు.. ఎక్కడంటే ?

తొలుత మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ హ్యూస్టన్ లోని భారత కాన్సులేట్ జనరల్ తో పాటు అన్ని ఏజెన్సీలను సమన్వయం చేయించి ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించే బాధ్యతను తానా తీసుకుంది. ‘‘అలెన్ మాల్ లో జరిగిన హింసాకాండ నన్ను తీవ్రంగా కలచివేసింది. తానా తరఫున బాధితులందరికీ, ముఖ్యంగా ఐశ్వర్య, ఆమె కుటుంబానికి మా మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నాం’’ అని తానా ప్రతినిధి అశోక్ బాబు తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.

తన భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని మహిళపై ఎస్ఐ దాడి.. జగిత్యాలలో ఘటన

టెక్సాస్ లోని స్థానిక సంస్థలో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఐశ్వర్య ఇటీవల ఓ మాల్ లో జరిగిన కాల్పుల్లో చనిపోయారు. ఆ సమయంలో ఆమెతో పాటు మరో ఎనిమిది మంది కూడా మరణించారు. ఐశ్వర్య తండ్రి టి.నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.