ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ జంట తమ కూతురును కాపాడేందుకు ఏకంగా చిరుత పులితోనే పోరాడారు. తల్లిదండ్రుల దాడికి తట్టుకోలేని ఆ పులి చిన్నారిని అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయింది. 

తమ మూడేళ్ల కూతురును కాపాడేందుకు దంపతులు ఓ చిరుత పులితోనే పోరాడారు. చివరికి విజయం సాధించారు. గాయాలపాలైన బాలికను హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బిజ్నోర్ జిల్లాకు చెందిన మదన్ సింగ్ (30), అతడి భార్య సునీతాదేవి (27) వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఆ పొలానికి సమీపంలోనే వారి మూడేళ్ల కూతురు గాయత్రి ఆడుకుంటోంది.

ఇదేం సరదా.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ లో కంప్రెషర్ పంపుతో గాలి కొట్టిన స్నేహితుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

అయితే అదే సమయంలో ఆ చిరుత కూతురుపై దాడి చేసింది. దీంతో ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడ్చింది. పాప ఏడుపు విన్న తల్లిదండ్రులు వేగంగా అటు వైపు పరుగెత్తుకొచ్చారు. ఆ సమయంలో చిరుత పులి గాయత్రిని లాక్కెళుతోంది. దీనిని గమనించిన ఆ దంపతులు పులి వెంటపడ్డారు.

మే 13న బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుంది - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్

తండ్రి పులిని పట్టుకొని దాడి చేయడం ప్రారంభించారు. బాలిక తల్లి గట్టిగా అరుస్తూ, కేకలు పెట్టింది. దీంతో ఆ క్రూర జంతువు భయపడింది. బాలికను అక్కడే వదిలేసి పారిపోయింది. అయితే చిరుత దాడిలో బాలికకు గాయాలు అయ్యాయి. తల్లిదండ్రులు ఆ బాలికను వెంటనే చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. 

తన భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని మహిళపై ఎస్ఐ దాడి.. జగిత్యాలలో ఘటన

కాగా.. ఆ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో పొలాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని బిజ్నోర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏకే సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. ఇటీవలి కాలంలో చిరుత దాడులు జరిగిన సున్నితమైన ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశామని తెలిపారు. పులిని పట్టుకునేందుకు పదకొండు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇకపై బార్లలోనూ క్వార్టర్, హాఫ్‌ బాటిళ్ల అమ్మకాలు..!

ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి పులి దాడి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో అఫ్జల్ గఢ్ ప్రాంతంలో ఓ పులి దాడి చేయడంతో ఇద్దరు మైనర్ చిన్నారులు సహా నలుగురు మరణించారు.