Asianet News TeluguAsianet News Telugu

స్టార్ బక్స్ సీఈఓ గా భారత సంతతి వ్యక్తి..

స్టార్‌బక్స్ కార్ప్ సీఈవోగా భార‌త సంత‌తికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ ఎంపికయ్యారు. ఆయన గతంలో రెకిట్ కు సీఈవో గా పని చేశారు. స్టార్ బక్స్ ను లాభాల బాటలో నడిపించేందుకు ఆయన కృషి చేయనున్నారు. 

An Indian-origin person is the CEO of Star Bucks.
Author
First Published Sep 2, 2022, 9:19 AM IST

స్టార్‌బక్స్ కార్ప్ గురువారం తన కొత్త సీఈవోగా భార‌త సంత‌తికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ను నియమించింది. ప్రపంచంలోని అతిపెద్ద కాఫీ చైన్ ను పున‌ర్ ఆవిష్క‌రించేందుకు.. గ‌తంలో లైసోల్ క్రిమిసంహారక మందుల తయారీ సంస్థ‌ను ఒక దారిలో పెట్టిన వ్య‌క్తిని సీఈవోగా ఎంపిక చేసింది.

మురుగ మఠం పీఠాధిపతి శివమూర్తి అరెస్టు.. ఎఫ్ఐఆర్ న‌మోదైన ఆరు రోజుల త‌ర్వాత అదుపులోకి..

ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను త‌యారు చేసే రెకిట్‌కు నరసింహన్ CEOగా ప‌ని చేశారు. అయితే బుధ‌వారం తాను ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్రకటించారు. దీంతో FTSE-లిస్టెడ్ రెకిట్ షేర్లు 4 శాతం పడిపోయాయి.

ముగ్గురు పిల్లలను నర్మదా కాలువలో పడేసి.. ప్రియుడితో కలిసి మహిళ ఆత్మ‌హ‌త్య

ప్ర‌స్తుతం స్టార్‌బక్స్ కల్లోల్లాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంస్థ ప‌రిస్థితి అంతగా మెరుగ్గా లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న స‌మ‌యంలో ఆ సంస్థ‌లో ప‌ని చేసే కార్మికులు త‌మ‌కు మెరుగైన ప్రయోజనాలు, వేతనాలు క‌ల్పించాల‌ని ఒత్తిడి చేశారు. దీంతో 200 కంటే ఎక్కువ US స్టోర్‌లు గత సంవత్సరంలో యూనియన్‌గా మారాయి. ఆ  సంస్థ పదార్థాలు, లేబర్ అత్య‌ధికంగా ఖర్చులను ఎదుర్కొంటోంది. చైనాలో COVID-19 పరిమితులు కార‌ణంగా త‌న అతిపెద్ద విదేశీ మార్కెట్ బిజినెస్ మంద‌గించింది.

కాగా.. నరసింహన్ అక్టోబర్‌లో స్టార్‌బక్స్‌లో చేరనున్నారు. ఉద్యోగుల‌కు మెరుగైన వేతనాలు, సంక్షేమాన్ని అందించ‌డంతో పాటు కస్టమర్ మంచి అనుభవాన్ని అందించ‌డం వంటి విష‌యాల‌పై కొన్ని నెల‌ల పాటు, అలాగే కంపెనీ, దాని రీఇన్వెన్షన్ ప్లాన్ ను తెలుసుకున్నతర్వాత వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో ఆయ‌న అధికారం తీసుకోన్నారు. అప్పటి వరకు తాత్కాలిక-CEO హోవార్డ్ షుల్ట్జ్ కంపెనీకి నాయకత్వం వహిస్తారు.
మైన‌ర్ పై డిజిట‌ల్ రేప్‌.. జీవితఖైదు విధించిన కోర్టు

నరసింహన్ సెప్టెంబరు 2019లో రెకిట్‌లో చేరారు. ఆ సంస్థ‌ను 1999లో స్థాపించారు. బ‌య‌టి నుంచి వ‌చ్చి ఆ సంస్థ‌కు సీఈవోగా వ్య‌వ‌హించిన మొద‌టి వ్య‌క్తిగా ఆయ‌న నిలిచారు. ఆయ‌న క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో కూడా కంపెనీని విజ‌య‌వంతంగా న‌డిపించారు. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయ‌న .. ఆ కంపెనీ ఎదుగుద‌ల‌కు ఎంతో కృషి చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios