Asianet News TeluguAsianet News Telugu

మురుగ మఠం పీఠాధిపతి శివమూర్తి అరెస్టు.. ఎఫ్ఐఆర్ న‌మోదైన ఆరు రోజుల త‌ర్వాత అదుపులోకి..

తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగ మఠం పీఠాధిపతి శివమూర్తి ను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. 

The head of the Muruga Math, Sivamurthy, was arrested. Six days after the FIR was registered, he was detained.
Author
First Published Sep 2, 2022, 8:49 AM IST

బాలిక‌ల‌పై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మురుగ మఠాధిపతి శివమూర్తిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆరు రోజుల తరువాత ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) ఫిర్యాదు చేసిన తరువాత శివమూర్తిపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద నజర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బీహార్ లో దారుణం.. చెవి నొప్పి అని హాస్పిటల్ కి వెడితే.. చేయి పోయింది.. చివరికి...

ఈ కేసులో మరో 5-6 మంది బాధితులు ఉండొచ్చని, లేదా నిందితుడికి వ్యతిరేకంగా మరిన్ని ఫిర్యాదులు రావొచ్చని ఫిర్యాదుదారు ఒడనాది పరశురామ్ తెలిపారు. రహస్యంగా ఒక ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఈ మఠాధిప‌తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని అరెస్టు చేసే స‌మ‌యంలో అక్క‌డ ఎలాంటి పోలీసు వాహ‌నాలూ లేవు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న వెంట‌నే వైద్య ప‌రీక్ష‌ల కోసం చిత్ర‌దుర్గ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న రష్మీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి శివమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయ‌నును మెజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌ర్చే అవ‌కాశం ఉంది. 

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై శివ‌మూర్తి శరణరు స్పందించారు. ఎంతో కాలంగా త‌న‌పై జ‌రుగుతున్న కుట్ర ఫ‌లిత‌మే ఈ అత్యాచారా ఆరోప‌ణ‌లను అని పేర్కొన్నారు. అయితే శరణరుతో పాటు మరో నలుగురిపై నమోదైన కేసును ప్రస్తుతం కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మురుగ మఠాధిపతిని అరెస్టు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ కొద్ది రోజుల క్రితం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయం వ‌ద్ద‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మఠం హాస్టల్లో ఉంటున్న పలువురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై నజరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నాలుగు రోజుల తరువాత ఈ నిర‌స‌న చేశారు. 

గ‌త కొంత కాలంగా మ‌ఠాధిప‌తిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఈ వారం ప్రారంభంలో మాజీ సీఎం, ప్ర‌ముఖ లింగాయత్ నాయకుడు బి.ఎస్.యడియూరప్ప ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. మ‌ఠాధిప‌తి ప్ర‌తిష్ఠ‌ను నాశ‌నం చేసేందుకే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కుట్ర జ‌రుగుతోంద‌ని అన్నారు. శివ‌మూర్తి శరణరును స‌మ‌ర్థించారు. కౌంటర్‌ ఫిర్యాదు చేసిన మాజీ జేడీ(ఎస్‌) నేత జీకే బసవరాజన్‌ను ఆయన ఎత్తిచూపారు. మ‌ఠాధిప‌తి రాష్ట్రవ్యాప్తంగా గౌరవప్రదమైన దృక్పథం కలిగిన వ్యక్తి అమాయకుడని అన్నారు.

ముగ్గురు పిల్లలను నర్మదా కాలువలో పడేసి.. ప్రియుడితో కలిసి మహిళ ఆత్మ‌హ‌త్య

అయితే మఠాధిపతిని పోలీసులు ప్రశ్నించడానికి ముందే మఠానికి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చినందుకు యడియూరప్ప వివిధ వర్గాల నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శివమూర్తి కి ఇలా బహిరంగ మద్దతు ప్ర‌క‌టించ‌డం దర్యాప్తును ప్రభావితం చేసే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios