Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు పిల్లలను నర్మదా కాలువలో పడేసి.. ప్రియుడితో కలిసి మహిళ ఆత్మ‌హ‌త్య

ఒక మ‌హిళ త‌న ప్రియుడి సాయంతో త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను న‌ర్మ‌దా న‌దిలోకి ప‌డేసింది. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ కూడా న‌ర్మ‌దా న‌దిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. పిల్ల‌ల డెడ్ బాడీల‌ను నీటిపై తెలియాడుతూ క‌నిపించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.
 

Gujarat : Throwing three children in the Narmada canal.. Woman commits suicide along with her boyfriend
Author
First Published Sep 2, 2022, 3:59 AM IST

గుజరాత్: ఒక మ‌హిళ త‌న ప్రియుడి సాయంతో త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను న‌ర్మ‌దా న‌దిలోకి ప‌డేసింది. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ కూడా న‌ర్మ‌దా న‌దిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. పిల్ల‌ల డెడ్ బాడీలు నీటిపై తెలియాడుతూ క‌నిపించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న గుజ‌రాత్ లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

ప్రియుడి సాయంతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను నర్మదా న‌ది కాలువలో పడేసింది. ఆ తర్వాత ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఉత్తర గుజరాత్ లోని తారాద్ తాలూకాలో కాలువలో దూకి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పిల్ల‌ల డెడ్ బాడీలు నీటిపై తెలియాడుతూ క‌నిపించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స్థానికంగా ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఐఏఎన్ఎస్ నివేదించిన ప్ర‌కారం.. చందర్ గ్రామ మాజీ సర్పంచ్ మఫాజీ పటేల్ మాట్లాడుతూ.. "గురువారం తెల్లవారుజామున నర్మదా కాలువ గుండా వెళుతున్న ప్రజలు గోడపై సెల్ ఫోన్లు ఉండ‌టం గ‌మ‌నించారు. అలాగే, ప‌క్క‌నే ఉన్న కాలువ‌లో ఇద్దరు తేలియాడుతున్న పిల్లల మృతదేహాలను చూశారు. వారు దాని గురించి నాకు చెప్పారు. నేను వెంటనే పోలీసులకు స‌మాచారం అందించాను. అధికారుల‌ను ఈ విష‌యం గురించి అప్రమత్తం చేసి, అగ్నిమాపక బృందాన్ని, గ్రామంలోని డైవర్లను సాయం కోసం అభ్యర్థించాను" అని తెలిపారు. 

మ‌ఫాజీ పటేల్ ఇంకా మాట్లాడుతూ.. "ఒక సెల్ ఫోన్ నిరంతరం రింగ్ అవుతోంది. నాకు కాల్ వచ్చినప్పుడు, వావ్ తాలూకాలోని దేతాలి గ్రామం నుండి ముక్తాబెన్ ఠాకోర్ అనే మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారనీ, కుటుంబ సభ్యులు వారి గురించి తెలుసుకోవ‌డానికి ఫోన్‌కు కాల్ చేస్తున్నారని తెలుసుకున్నాను. నేను కాల్ చేసిన వ్యక్తికి రెండు మృతదేహాలను కాలువ నుండి బయటకు తీయడం గురించి తెలియజేసాను" అని అన్నారు. ఈ క్ర‌మంలోనే ముక్తాబెన్ మామగారు ఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. ఆమె ఈశ్వర్‌భాయ్‌ను (భ‌ర్త‌) వివాహం చేసుకున్నదని చెప్పారు. వారికి ఒక అమ్మాయితో పాటు ముగ్గురు పిల్ల‌లు ఉన్నార‌ని పటేల్‌కి చెప్పారు. అయితే, గాంధీనగర్ సమీపంలో ఈశ్వర్‌భాయ్ కూలీగా గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. ముక్తాబెన్- పిల్లలు 15 రోజుల క్రితం వరకు అతనితో నివసిస్తున్నారు. వారు గ్రామానికి తిరిగి వచ్చారు. ముక్తాబెన్‌కు ధరధార గ్రామానికి చెందిన యువకుడితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారంలో ఉంద‌ని సర్పంచ్‌ తెలిపారు.

ఈ క్ర‌మంలోనే "ముక్తాబెన్ పిల్లలు-ఆమె ప్రేమికుడితో కలిసి పారిపోయిందని ఠాకోర్ కుటుంబం నమ్మింది. కలిసి జీవించడానికి వేరే మార్గం కనిపించకపోవడంతో, వారు మొదట పిల్లలను కాలువలో విసిరి, తరువాత కలిసి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయంత్రం నాటికి, మూడవ బిడ్డ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. ఇప్పుడు డైవర్లు-అగ్నిమాపక బృందం ఆ ఇద్ద‌రి కోసం వెతుకుతున్నారు" అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios