అమృత్‌సర్ జోడా పాఠక్ వద్ద దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రావణ దహనం కార్యక్రమానికి  అన్ని అనుమతులు తీసుకొన్నట్టుగా నిర్వాహకుడు సౌరబ్ మదన్ ప్రకటించారు.


అమృత్‌సర్: అమృత్‌సర్ జోడా పాఠక్ వద్ద దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రావణ దహనం కార్యక్రమానికి అన్ని అనుమతులు తీసుకొన్నట్టుగా నిర్వాహకుడు సౌరబ్ మదన్ ప్రకటించారు.

Scroll to load tweet…

దసరా సందర్భంగా రావణ దహనం వీక్షిస్తుండగా రైలు ఢీకొని 61 మంది మృత్యువాతపడగా, మరో 72 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
రావణ దహనం కార్యక్రమాన్ని సౌరబ్ మదన్ నిర్వహించాడు.రైలు ఢీకొని 61 మంది మృత్యువాతపడగానే సౌరబ్ అదృశ్యమయ్యాడు. అయితే ఈ ఘటనకు తనకు సంబంధం లేదని ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.

రావణ దహనం సందర్భంగా గ్రౌండ్తో పాటు ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులు తీసుకొన్నట్టు చెప్పారు. అంతేకాదు రైలు పట్టాలపై నిలబడకూడదంటూ కనీసం 10 దఫాలకు పైగా విన్నవించినట్టు ఆయన ఆ వీడియోలో గుర్తు చేశారు.

రైలు పట్టాల పక్కన రావణ దహనం ఉంటే.... జనం పట్టాలపై నిలబడ్డారన్నారు. ఈ ఘటనతో తాను కలత చెందినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురైదుగురు ఉద్దేశ్యపూర్వకంగా తనకు ఆపాదించే ప్రయత్నిస్తున్నారని చెప్పారు.ఈ వీడియోలో అతను చేతులు జోడించి ఏడుస్తూ ఈ ఘటనకు తనకు సంబంధం లేదని వేడుకొన్నాడు. 

సంబంధిత వార్తలు

వారిని దత్తత తీసుకుంటా, నా భార్యపై విమర్శలా: సిద్ధూ

అమృత్‌సర్ రైలు ప్రమాదం: రాళ్ల దాడికి దిగారు: డ్రైవర్

పంజాబ్ ప్రమాదం: సెల్ఫీల మోజులో పడి

దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం