రావణ దహనం పూర్తైన వెంటనే తాను అక్కడి నుండి వెళ్లిపోయానని కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్దూ చెప్పారు.

అమృత్‌సర్: రావణ దహనం పూర్తైన వెంటనే తాను అక్కడి నుండి వెళ్లిపోయానని కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్దూ చెప్పారు. రైలు ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.

Scroll to load tweet…

అమృత్‌సర్ జోడా ఫాటక్ వద్ద దసరా ఉత్సవాలను పురస్కరించుకొని రావణ దహనం చేస్తున్న సమయంలో రైలు ఢీకొన్న ప్రమాదంలో 50 మందికి పైగా మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

శుక్రవారం నాడు జోడా ఫాటక్ వద్ద రావణ దహనం కార్యక్రమంలో నవజ్యోత్ కౌర్ సిద్దూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందే తాను అక్కడి నుండి వెళ్లిపోయినట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు.

ప్రస్తుతం బాధితులకు అవసరమైన వైద్య సహాయం అవసరమన్నారు. కానీ, ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. 

సంబంధిత వార్తలు

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం