Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 58 మంది దుర్మరణం

అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనంలో పెను విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై నిలుచుని రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Punjab: train accident at amruthsar 100 people die
Author
Punjab, First Published Oct 19, 2018, 8:27 PM IST

పంజాబ్: అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనంలో పెను విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై నిలుచుని రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 58 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే జోడా ఫాటక్ దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు ఏడు వందల మంది రైల్వే ట్రాక్ పై గుమ్మిగూడారు. ఇంతలో రావణ విగ్రహానికి నిప్పు పెట్టడంతో బాణ సంచా పేలింది. ఆ సమయంలో పఠాన్ కోట నుంచి అమృత్ సర్ వెళ్తున్న డీఎంయూ ట్రైన్ నంబర్ 74943 వేగంగా దూసుకు వచ్చింది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వేగంగా వస్తుంది. అయితే బాణ సంచా శబ్ధాలకు ట్రైన్ వస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించలేకపోయారు. 

 

 

వేగంగా ట్రైన్ దూసుకు రావడంతో ప్రజలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రైలు వేగానికి మృతదేహాలు మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయి. ట్రైన్ కింద పడిన వారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయింది. రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. ఎటు చూసినా మాంసపు ముద్దలే దర్శనమిస్తున్నాయి. 
 
దాదాపు ఏడు వందల మంది రావణ దహన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు 50 మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రైల్వే గేట్ వేసినా కూడా ప్రజలు గేటు దూకి మరీ వచ్చి వీక్షించారని తెలుస్తోంది.

రావణ దహనం కార్యక్రమం ప్రతీ ఏటా అదే ప్రాంతంలో నిర్వహిస్తారని స్థానికులు చెప్తున్నారు. అయితే ఎప్పుడు ఇలాంటి ఘోరం జరగలేదని చెప్తున్నారు. రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారన్న విషయం తెలసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని అయితే రైలు వస్తుందన్న సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. పోలీసులు కానీ, నిర్వాహకులు కానీ రైల్వే శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. 

 

పోలీసులు ప్రజలను రైలు ట్రాక్ దగ్గరకు వెళ్లకుండా నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎంతమంది చనిపోయారని అన్న అంశంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. స్థానికుల సహాయంతో మృతదేహాలను గుర్తిస్తున్నారు. మరోవైపు ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు రైల్వే శాఖ, పోలీసులు సమాధానం చెప్పాలని వాళ్లే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios