అమృత్‌సర్: దసరా పర్వదినం సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ జోడా ఫాఠక్ వద్ద  రైలు ఢీకొన్న ప్రమాదంపై  తన తప్పు ఏమీ లేదని  రైలు డ్రైవర్ అరవింద్ కుమార్  ప్రకటించారు. ఈ మేరకు  రైల్వే అధికారులకు, పోలీసులకు లిఖితపూర్వకంగా లేఖ రాశాడు. అయితే డ్రైవర్ చేబుతున్న వాదనల్లో  వాస్తవం లేదని  స్థానికులు  చెబుతున్నారు.

దసరా రోజున  జోడా పాఠక్ వద్ద రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై నుండి రైలు వెళ్లిన ఘటనలో 61 మంది మృతి చెందగా, 72 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై  రైలు డ్రైవర్ అరవింద్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని  విచారిస్తున్నారు.

పట్టాలపై జనం ఉన్న విషయాన్ని గుర్తించిన తర్వాత  అత్యవసరంగా బ్రేకుల్ని వేసినట్టు అరవింద్ కుమార్ చెప్పారు. కానీ, అప్పటికే  కొందరు పట్యటాలపై  అలానే ఉండిపోయారని చెప్పారు. దీంతో జరగరాని నష్టం జరిగిందన్నారు.  రైలు నిలిచిపోయే సమయంలో స్థానికులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని  దీంతో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తాను రైలును నిలిపివేయకుండా అమృత్‌సర్ తీసుకెళ్లినట్టు  ఆయన తన వాంగ్మూలంలో చెప్పారు.

అయితే  రైలు డ్రైవర్ వాదనతో స్థానికులు ఏకీభవించడం లేదు. కనీసం రైలును  నెమ్మదిగా నడిపే ప్రయత్నం కూడ చేయలేదన్నారు. రైలు ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో స్థానికులు చనిపోతే  వారి గురించి పట్టించుకోకుండా రైలుపై ఎలా దాడి చేస్తామని స్థానిక కౌన్సిలర్ షైలేందర్ సింగ్ ప్రశ్నించారు.  రైలుపై దాడి చేస్తారా... ఆ ఆలోచనే తమకు లేదన్నారు.

సంబంధిత వార్తలు

పంజాబ్ ప్రమాదం: సెల్ఫీల మోజులో పడి

దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

కళ్లెదుట ఘోరం జరిగినా పట్టించుకోని సిద్ధూ భార్య: స్థానికుల ఆగ్రహం

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం