రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దివంగత ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కంటే గొప్ప బ్రాహ్మణుడు అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారతీయులందరీ డీఎన్ ఏ ఒకటే అని చెప్పారు. 

భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. సర్దార్ పణిక్కర్ స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆయ‌న సోమవారం ప్రసంగించారు. హిందూ వ్యవస్థలో నాలుగు వర్ణాలున్నాయని, అవి రక్తం ఆధారంగా కాకుండా పాత్ర ఆధారంగా, జాతి (కులం) ఆధారంగా ఉందని అన్నారు. “ భగవత్గీతలో శ్రీకృష్ణుడు ఆ వ్యక్తి తెలివితేటలు, ఉదారత, ధైర్యవంతుడైతే అత‌డు బ్రాహ్మణుడని చెప్పారు. గొప్ప పండితుడు అయిన బీఆర్ అంబేద్కర్ ఎస్సీ కాదు బ్రాహ్మణుడు అని నేను నమ్ముతున్నాను. అతను ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండి అనేక డిగ్రీలు, పీహెచ్ డీల‌ను పొందారు. రాజ్యాంగం కోసం ఎన‌లేని కృషి చేశారు.

తమిళనాడులో గంజాయి చాక్లెట్ల విక్రయం: ఒకరి అరెస్ట్, మరో 15 మంది కోసం గాలింపు

‘‘ అంబేద్కర్ నెహ్రూ కంటే గొప్ప బ్రాహ్మణుడు ఎందుకంటే నెహ్రూ ఎప్పుడూ ఏ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేదు. అతడి కుటుంబ సభ్యులు కూడా అనేక పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు.’’ అని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. దేశ చరిత్రను తిరగరాయడానికి NCERT ఒక ప్రధాన పనిని చేపట్టిందని ఆయ‌న చెప్పారు. “ ప్రస్తుతం పాఠ్య పుస్తకాలు బ్రిటిష్ వారి లేదా భారతీయ బోధకులచే తయారు చేయబడిన చరిత్రను కలిగి ఉన్నాయి. వారి పుస్తకాలు బ్రిటిష్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి. భారతదేశం ముక్కలుగా ఉందని, దానిని బ్రిటీషర్లు కలిసి ఉంచారని, ద్రావిడులు నివాసులుగా ఉన్నారని, ఆర్యులు పశ్చిమ ఐరోపా నుండి వచ్చారని వారు రాశారు. ఇవన్నీ తప్పుడు వాస్తవాలు. యూనివర్శిటీల అధునాతన అధ్యయనాలు ఎక్కువ లేదా తక్కువ భారతీయులందరికీ ఒకే DNA కలిగి ఉన్నాయని ఉత్తర, దక్షిణ జాతి లేదని నిర్ధారించింది. దీన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి. ’’ అని అన్నారు.

అమెరికాలో అబ్బాయి-ఇండియాలో అమ్మాయి... వర్చువల్ వెడ్డింగ్ కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..

హిందూ మతం ఎప్పుడూ ఏ మతంతోనూ శత్రుత్వం వహించలేదని, జిహాద్ ఉద్యమం కారణంగా దూకుడుగా ఉన్న ఇస్లాంతోనే సమస్య ఉందని పేర్కొన్న స్వామి.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ హిందువులను చెడుగా చూస్తున్నాయని అన్నారు. బంగ్లాదేశ్‌లో 32 శాతం ఉన్న హిందువుల జనాభా ఇప్పుడు 7 శాతానికి తగ్గిందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో హిందువుల సంఖ్య 24 శాతం నుంచి 2 శాతానికి తగ్గిందని చెప్పారు. హిందువులు ఇతర మతాల కంటే ఎక్కువ సహనంతో ఉంటారని చెప్పారు.

‘‘ భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య శాంతిని కోరుకోని కొన్ని అంశాలు ఉన్నాయి. వారిని శిక్షించాలంటే బీజేపీ దృఢంగా ఉండాలి. కానీ ముస్లింలందరూ ఒకటే అనే వారి ప్రచారానికి లొంగకూడదు. హిందువులు అన్ని మతాల దేవుళ్లని నమ్ముతారు. అయితే ఈ ఆలోచనను ఇస్లాం, క్రైస్తవం, యూదులు, ఇతరులు అంగీకరించరు. ’’ అని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

చికెన్ పకోడీ పెట్టిన చిచ్చు.. భర్త ఆత్మహత్య, కత్తిపోట్లతో ఆస్పత్రిలో భార్య...

విద్యా విధానంలో సంస్కృత భాష తప్పనిసరిగా ఉండాల్సిందేనని, 10 ఏళ్ల వరకు మాతృభాషకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయ‌న అన్నారు. ఆ తర్వాత దానిని బోధనా మాధ్యమంగా కొనసాగించవచ్చని, అయితే ఇతర భాషలను నేర్చుకోవాలని స్వామి చెప్పారు. “హిందీ పదజాలం సంస్కృతం నుండి వచ్చినందున, హిందీ కంటే సంస్కృతాన్ని ఒక ఎంపికగా మార్చడం మంచిది. ’’ అని అన్నారు. హిందువులను విభజించడానికి, బ్రిటీషర్లు సంస్కృతం స్థానంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.” అని ఆయన అన్నారు.