చికెన్ పకోడీ ఓ కాపురంలో చిచ్చు పెట్టింది. రుచిగా చేయలేదని భార్యను చితకబాదిన భర్త.. ఆ తరువాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

బెంగళూరు : భార్యభర్తల మధ్య చికెన్ కబాబ్ విషయంలో తలెత్తిన గొడవ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళూరు బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అరెకెరె లేఔట్ లో గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సురేష్ (48) బొమ్మనహళ్లిలోని గార్మెంట్స్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. చికెన్ కబాబ్ చేయాలని భార్య శాలిని(42)ని అడిగాడు. భర్త అడిగాడు కదా అని ఆమె చేసి పెట్టింది. 

అడగ్గానే చేసిపెట్టింది కదా అని తినేసి ఊరుకోలేదు ఆ భర్త. వంకలు పెట్టడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా రుచిగా లేవని తీవ్ర కోపానికి వచ్చాడు. ఆమెకు చావచితకబాదాడు. దగ్గర్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె తల మీద, చేతుల మీద దాడి చేశాడు. ఆ తరువాత అక్కడినుంచి పరారయ్యాడు. షాలిని అరుపులు, కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చారు. అప్పటికే సురేష్ అక్కడ లేడు. 

షాలిని పరిస్థితి గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు షాలిని వాంగ్మూలం తీసుకున్నారు. షాలిని పరిస్థితిని.. ఘటనాస్తలాన్ని పరిశీలించి ఆ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు సురేష్ కోసం వెతకడం మొదలు పెట్టారు. కాగా, పరారీలో ఉన్న సురేష్ తమ ఇంటికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ఖాళీ ప్రాంతంలో చెట్టు కొమ్మకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

పదిరూపాయలు ఆశచూపి.. 13యేళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారం, 76, 47యేళ్ల వ్యక్తులు అరెస్ట్...

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జూన్ 11న కర్ణాటకలోనే చోటు చేసుకుంది. కుమార్తె పుట్టినరోజున చికెన్ కూర చేయలేదనే ఆగ్రహంతో కొడవలితో భార్యను హతమార్చాడు. హతురాలిని షీల(28)గా గుర్తించారు. భార్యను హతమార్చిన భర్తకు తాగిన మత్తు దిగిపోవడంతో చేసిన తప్పును గుర్తించి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా కోడూరు గ్రామానికి చెందిన కెంచప్ప- షీలా దంపతులు. ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక్క కుమార్తె సంతానం. 

కొంతకాలంగా భార్య ప్రవర్తనపై సందేహాంతో తరచూ ఇద్దరూ గొడవ పడేవారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదుర్చారు. అయినా భర్త వేధింపులు ఆగకపోవడంతో వాటిని తట్టకోలేక కొన్నాళ్లపాటు పుట్టింటికి వెళ్ళింది. ఘటన జరిగిన రోజు రాత్రి కూతురు జన్మదిన వేడుకల సందర్భంగా పుట్టింటి నుంచి భర్త దగ్గరికి వచ్చింది. కుమార్తె పుట్టినరోజున చికెన్ చేయాలంటూ కెంచెప్ప పురమాయించాడు. అయితే ఆమె ఎందుకో ఆ పని చేయలేకపోయింది. ఇంటికి వచ్చిన భర్త.. భార్య చికెన్ వండలేదని తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికి మద్యం మత్తులో ఉన్న భర్త షీలాతో గొడవకు దిగాడు. పట్టరాని కోపంతో అందుబాటులో ఉన్న కొడవలితో ఆమె మీద దాడిచేసి నరికేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. ఆ తరువాత కనిపించకుండా మాయమైన ఆ వ్యక్తి మద్యం మత్తు దిగిపోవడంతో మూడోరోజు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.