ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియా రిమాండ్ ముగిసింది. దీంతో ఆయనను ఈ రోజు తిరిగి సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పిలిచిన ప్రతీ సారి తాను విచారణకు వెళ్లానని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే అన్ని రికవరీలు జరిగాయని, తనను కస్టడీలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరైందని, తాను ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ముఖ్యమైన రాజ్యాంగ పదవిలో ఉన్నానని, సమాజంలో లోతైన మూలాలు ఉన్నాయని సిసోడియా పేర్కొన్నారు.
ఏషియానెట్ న్యూస్ కార్యాలయ పై దాడిని ఖండిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరసన
ఈ బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ నేడు విచారించనున్నారు. జీఎన్సీటీడీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు అతడిని ప్రత్యేక రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చడంతో ఐదు రోజుల రిమాండ్ కు అనుమతి లభించింది. ఈ రిమాండ్ నేటితో ముగియడంతో తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.
సిసోడియాను సీబీఐ రిమాండ్ కు పంపేటప్పుడు, నిందితుడు ఇంతకు ముందు రెండుసార్లు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాడని, అయితే అతడి విచారణలో అడిగిన చాలా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో విఫలమయ్యాడని, అందువల్ల ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో అతనిపై వచ్చిన నేరారోపణ సాక్ష్యాలను న్యాయబద్ధంగా వివరించడంలో విఫలమయ్యాడని ట్రయల్ కోర్టు అభిప్రాయపడింది.
స్కూల్ ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు.. 9వ తరగతి బాలిక ఆత్మహత్య
ఆయన స్వీయ నేరారోపణ ప్రకటనలు చేస్తారని ఆశించలేమన్నది వాస్తవమేనని కోర్టు పేర్కొంది. అయితే న్యాయం, నిష్పాక్షిక దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా ఆయన తన వద్ద ఉన్న ప్రశ్నలకు కొన్ని న్యాయబద్ధమైన సమాధానాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపింది. నిందితుడి కిందిస్థాయి ఉద్యోగుల్లో కొందరు కొన్ని వాస్తవాలను బహిర్గతం చేశారని, వాటిని ఆయనపై అభియోగాలుగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది.
గాంబియాలో చిన్నారుల మరణాలకు భారత్ లో తయారైన దగ్గు సిరప్ వినియోగానికి సంబంధాలున్నాయ్ - సీడీసీ నివేదిక
ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా కొన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు కూడా బయటకు వచ్చాయని, వాటి గురించి ఆయనను అడిగే ప్రశ్నలకు కొన్ని నిజమైన, చట్టబద్ధమైన సమాధానాలు కనుగొనాల్సి ఉందని తెలిపింది. నిందితుల కస్టడీలో ఉంచి విచారిస్తేనే ఇది సాధ్యమవుతుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆయనను విచారించే సమయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీడియో రికార్డు చేయాలని, ఆ ఫుటేజీని భద్రపర్చాలని సీబీఐని ఆదేశించింది.
