అయ్యో.. వరద నీటిలో పడి చనిపోయిన బాలుడి మృతదేహాన్నివెలికి తీస్తూ.. మునిగిపోయిన పోలీసు ఆఫీసర్.. వీడియో వైరల్
వరద నీటిలో కొట్టుకుపోయి మరణించిన ఓ బాలుడి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి ఓ పోలీసు ఆఫీసర్ చనిపోయారు. ఆయన కూడా అదే నీటిలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఓ 40 ఏళ్ల పోలీసు ఆఫీసర్ వరద నీటిలో మునిగి చనిపోయారు. దేవాస్ జిల్లాలో వరదల్లో ఉన్న ఓ మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ఆయన అందులోనే మునిగిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా బీచ్ లోని మిస్టరీ వస్తువు చంద్రయాన్ -3 శకలమేనా ? ఫొటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ..
దేవాస్ జిల్లాలోని జామ్నర్ నదికి వచ్చిన వరద నీటిలో ఓ బాలుడు పడి చనిపోయాడు. అయితే ఆ బాలుడి మృతదేహం ఆదివారం నీటిలో తేలియాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ రాజారామ్ వాస్కాలే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో బాలుడు మృతదేహాన్ని స్థానికులెవరూ ఆ నీటిలో దిగేందుకు సాహసం చేయలేదు.
దీంతో పోలీసు ఆఫీసర్ రాజారామ్ వాస్కాలే తో పాటు పలువురు పోలీసులు రంగంలోకి దిగారు. ఓ తాడు సాయంతో వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి వెళ్లారు. ఎట్టకేలకు డెడ్ బాడీని చేరుకొని పట్టుకున్నారు. కానీ వాస్కాలే కొంత సమయం తరువాత తాడుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆయన ఆ నీటిలో మునిగిపోయాడు. వెంటనే ఇతర పోలీసు సిబ్బంది వాస్కలేను రక్షించడానికి మరో తాడును సిద్ధం చేయడానికి ప్రయత్నించారు.
వెంటనే గజ ఈతగాళ్లు వచ్చి వాస్కలేను నది నుంచి బయటకు తీశారు. కానీ ఆయన అప్పటికే అపస్మారస్థితికి చేరుకున్నారు. ఆయనను దగ్గరలో ఉన్న నేమావర్ ఆస్పత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం హర్దాలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్టు అక్కడి వైద్యులు ప్రకటించారు.
భర్త నుంచి దూరంగా ఉండే మహిళ.. వివాహితుడైన స్నేహితుడితో కలిసి ఉండాలని.. యూట్యూబ్ లో చూస్తూ..
కాగా.. ఆయన నీటిలోకి దిగడం, మునిగిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో వరద నీటి ప్రవాహ ఉధృతి అధికంగా ఉండటం కనిపిస్తోంది. ఆయన మునిగిపోవడం, ఇతర పోలీసు సిబ్బంది అరుపులు వినిపిస్తున్నాయి.