ఆస్ట్రేలియా బీచ్ లోని మిస్టరీ వస్తువు చంద్రయాన్ -3 శకలమేనా ? ఫొటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ..
ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్ లో లభించిన ఆ మిస్టరీ వస్తువు చంద్రయాన్ -3 కు సంబంధించిన శకలమే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చంద్రయాన్ -3 రాకెట్ లోని భాగాలను, ఈ మిస్టరీ వస్తువు ఫొటోలను పోలుస్తున్నారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్ లో దొరికిన ఒక అంతుచిక్కని వస్తువుపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. ఇది ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ -3 మిషన్ లోని భాగం కావచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇదేంటనే విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ప్రస్తుతం పరిశోధన జరుపుతోంద. దాని మూలాన్ని నిర్ధారించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధనా సంస్థల సహాయం కోరుతోంది.
భర్త నుంచి దూరంగా ఉండే మహిళ.. వివాహితుడైన స్నేహితుడితో కలిసి ఉండాలని.. యూట్యూబ్ లో చూస్తూ..
పాక్షికంగా దెబ్బతిన్న వస్తువు ఫొటోను ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ సోమవారం ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘‘పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన విచారణ జరుపుతున్నాం.’’ అని పేర్కొంది. ఈ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుంచి వచ్చి ఉండొచ్చని, మరింత సమాచారం అందించగల ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
సోషల్ మీడియాలో ఊహాగానాలు..
ఈ శకలం ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ కు సంబంధం ఉందని పలువురు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. దీనికి బలాన్ని చేకూర్చేలా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీకి) సంబంధించిన ఫొటోలు, ఈ శకలం ఫొటోలను పక్క పక్కన ఉంచి పోలుస్తున్నారు.
అయితే ఇది 2014 మార్చి 8న కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 227 మంది ప్రయాణికులతో అదృశ్యమైన ఎంహెచ్ 370 మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలోని భాగమని కూడా పలువురు చెబుతున్నారు. అయితే ఏవియేషన్ నిపుణుడు జెఫ్రీ థామస్ ప్రకారం.. ఇది బోయింగ్ 777 భాగం కాదని చెప్పారు. ఎందుకంటే ఎంహెచ్ 370 తొమ్మిదిన్నర కిందట తప్పిపోయిందని, కాబట్టి దాని శిథిలాలు మరింతగా అరిగిపోయి ఉంటాయని ఆయన ‘బీబీసీ’తో తెలిపారు.