Asianet News TeluguAsianet News Telugu

మంచి మనస్సు చాటుకున్న అక్షయ్ కుమార్.. ఢిల్లీ యువతి హార్ట్ సర్జరీ కోసం రూ.15 లక్షలు విరాళం

ఢిల్లీకి చెందిన ఓ యువతికి హార్ట్ సర్జరీ కోసం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ.15 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయకూడదని ఆయన కోరినా.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు. 

Akshay Kumar, who showed a good mind, donated Rs. 15 lakhs for the heart surgery of a Delhi girl.
Author
First Published Jan 10, 2023, 9:12 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తమ మంచి మనస్సును చాటుకుననారు. 2022లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు అందుకోకపోయినా.. నిరుపేదలకు అందించే ఏ సహాయాన్ని ఆపలేదు. తన సామాజిక సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా ఢిల్లీలోని 25 ఏళ్ల యువతి హార్ట్ సర్జరీ కోసం రూ.25 లక్షలను విరాళంగా అందజేశారు. 

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు..

వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని గురుగ్రామ్‌కు చెందిన యువతి ఆయుషి శర్మ చిన్న నాటి నుంచే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆమెకు గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇలాంటి ఆపరేషన్లు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఏర్పడింది. కానీ ఆమె కుటుంబ ఆ ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో లేదు.

జనవరి 19న తెలంగాణకు ప్రధాని మోడీ.. రూ.7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఆయుషి శర్మ ఆరోగ్య పరిస్థితి, ఆమె కుటుంబ నేపథ్యం తన సామ్రాట్ పృథ్వీరాజ్ దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ద్వారా నటుడు అక్షయ్ కుమార్ కు తెలిసింది. దీంతో ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ పబ్లిసిటీ ఇష్టం లేని ఆయన.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కుటుంబ సభ్యులను కోరారు. కానీ తమ కుటుంబానికి ఇంత సాయం చేసిన అక్షయ్ కుమార్ సేవా గుణం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఆయుషి తాత యోగేంద్ర అరుణ్ బయటకు వెల్లడించాడు. దీంతో ఆయన దాతృత్వం వెలుగులోకి వచ్చింది.

236 మంది ప్రయాణికుల విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు.. గుజరాత్ లో అత్యవసర ల్యాండింగ్

ఈ విషయంలో యోగేంద్ర ‘ఈ టైమ్స్’తో మాట్లాడుతూ... ‘‘నేను అక్షయ్ జీ నుండి డబ్బు తీసుకుంటానని డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేదితో చెప్పాను. కానీ నా కృతజ్ఞతలు అనుమతించాలని కోరాను.’’అని అన్నారు. అలాగే ఆయుషి పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ మా మనువరాలు గుండెలో లోపంతో జన్మించింది. ఇప్పుడు ఆమెకు 25 సంవత్సరాలు. ఆమె గుండె 25 శాతం మాత్రమే పనిచేస్తుందని, గుండె మార్పిడి చేయాలని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి వైద్యులు మాకు చెప్పారు. అక్షయ్ కుమార్ మాకు ఆర్థిక సాయం చేశారు. మేము ఇప్పుడు మార్పిడి కోసం దాత గుండె కోసం చూస్తున్నాము.’’ అని తెలిపారు.

మహారాష్ట్రపై క‌న్నేసిన ఆప్.. అన్ని ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామంటూ ప్ర‌క‌ట‌న

కాగా.. ఆయుషి మొత్తం చికిత్స ఖర్చు రూ.50 లక్షల వరకు ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. నిరుపేదలకు సాయం చేయడంలో చురుకుగా ఉండే అక్షయ్ కుమార్.. అవసరమైతే ఇంకా డబ్బును విరాళంగా ఇస్తానని చెప్పారని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios