Jamnagar: బాంబు బెదిరింపుతో మాస్కో-గోవా విమానం గుజరాత్ లోని జామ్ నగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అత్యవసర ల్యాండింగ్ చేసిన రష్యా విమానాన్ని పరిశీలించడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందాన్ని జామ్ నగర్ కు పంపించారు. 

Moscow-Goa international flight: 236 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో మాస్కో-గోవా అంతర్జాతీయ విమానం సోమవారం రాత్రి గుజరాత్ లోని జామ్ నగర్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపుతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబు తో పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం వెంట‌నే స్పందించింది. ఈ క్ర‌మంలోనే విమానాన్ని సురక్షితంగా తరలించామనీ, స్థానిక అధికారులు, పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీ చేస్తున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ యాదవ్ తెలిపారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

బాంబు బెదిరింపు కారణంగా మాస్కో నుంచి గోవా వెళ్తున్న విమానం జామ్ నగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత 236 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, బీడీడీఎస్, స్థానిక అధికారులు మొత్తం విమానం కోసం గాలిస్తున్నారు అని యాదవ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అంత‌కుముందు మాస్కో నుంచి గోవా వెళ్లే అంతర్జాతీయ విమానంలో బాంబు బెదిరింపున‌కు సంబంధించి గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఇమెయిల్ వచ్చింది.

Scroll to load tweet…
Scroll to load tweet…

అజూర్ ఎయిర్ విమానంలో బాంబు బెదిరింపు గురించి భారత అధికారులు తమను అప్రమత్తం చేసినట్లు రష్యా రాయబార కార్యాలయం ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. విమానం జామ్ నగర్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారు. అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విమానాన్ని తనిఖీ చేయడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జి) బృందాన్ని జామ్నగర్ కు పంపించారు. ముందుజాగ్రత్తగా దబోలిమ్ విమానాశ్రయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు గోవా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మాస్కో నుంచి దబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన అంతర్జాతీయ విమానం బాంబు భయంతో జామ్నగర్ కు మళ్లించినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (వాస్కో) సలీం షేక్ మీడియాకు తెలిపారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల రాకపోకలను పర్యవేక్షించేందుకు, అనుమానాస్పద కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి విమానాశ్రయంలో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు వాస్కో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స‌లీం షేక్ తెలిపారు. "మేము ఇక్కడ కార్యకలాపాలను ప‌ర్య‌వేక్షిస్తున్నాము. చింతించాల్సిన పని లేదు, ఇది కూడా పుకారు కావచ్చు, కానీ మేము ఎటువంటి అవకాశాలను తీసుకోవడం లేదు.. అన్ని ర‌కాలు చ‌ర్య‌లు చేప‌ట్టాము" అని DSP అన్నారు.