Asianet News TeluguAsianet News Telugu

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు..

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదు అయ్యింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ కలుగలేదు.పలు నివాసాలపై ఈ ప్రకంపనలు ప్రభావం చూపెట్టాయి. 

Earthquake again in Indonesia.. 7.7 magnitude on the Richter scale..
Author
First Published Jan 10, 2023, 6:41 AM IST

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్‌లో కూడా భూకంపం సంభవించింది. రాబోయే కొద్దిరోజుల పాటు భూకంపం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బలమైన భూకంపం వచ్చినప్పటికీ సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. గతేడాది కూడా ఇండోనేషియాలో భూకంపాలు సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసింది.

జనవరి 19న తెలంగాణకు ప్రధాని మోడీ.. రూ.7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోనేషియాలోని తువాల్ ప్రాంతానికి 342 ఆగ్నేయ దిశలో స్థానిక కాలమానం మధ్యాహ్నం 2:47 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అలాగే ఇండోనేషియాకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయని యూరోపియన్ సిస్మోలాజికల్ సెంటర్ పేర్కొంది. రాబోయే కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో మరో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఈఎంఎస్సీ హెచ్చరించింది. భూ ప్రకంపనల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

‘‘ భూకంపం అనంతర ప్రకంపనలు కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో అనుభూతి చెందుతాయి. అవసరం అనుకుంటే మీ భద్రత కోసం దెబ్బతిన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. నిఘా ఉంచండి.’’ అని ఈఎంఎస్సీ ట్వీట్ చేసింది. కాగా 2022 నవంబర్ లో కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. జావా ప్రావిన్స్‌లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఆ సమయంలో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. 62 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

236 మంది ప్రయాణికుల విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు.. గుజరాత్ లో అత్యవసర ల్యాండింగ్

ఇదిలా ఉండగా ఈ ఏడాది మొదటి నుంచే భారత్ లో కూడా వరుస భూకంపాలు వచ్చాయి. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అదే రోజు ఉదయం 10.57 గంటలకు బంగాళాఖాతంలో మరో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అయితే ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.5గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని బదఖ్సన్ ప్రాంతంగా ఉంది. దీని వల్ల ఢిల్లీతో పాటు జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని సామాన్లు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు,

 

Follow Us:
Download App:
  • android
  • ios