Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎయిమ్స్ పై సైబర్ దాడి.. పలు ఆరోగ్య సేవలకు అంతరాయం.. 

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో పలు ఆరోగ్య సేవలకు సేవలకు అంతరాయం కలిగింది

AIIMS Delhi services hit due to ransomware attack on server
Author
First Published Nov 24, 2022, 6:22 PM IST

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఇ-హాస్పిటల్ సర్వర్‌పై సైబర్ దాడి జరిగింది. రెండు రోజులు గడిచినా పరిస్థితి సద్దుమణగడం లేదు. ఈ దాడితో ఓపీడీ, నమూనా సేకరణ సేవలతో పాటు, ఆపరేషన్లు వంటి ఇతర సేవలు ప్రభావితమయ్యాయి. ransomware సైబర్ దాడి కారణంగా బ్యాకప్ సిస్టమ్‌పై కూడా ప్రభావితం అయినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.సైబర్ దాడితో పలు ప్రాథమిక ఆంశాలు మారినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ సంఘటన ను  ransomware దాడి అని, దీనిలో ఆన్‌లైన్ సేవలకు ప్రాప్యతను పునరుద్ధరించడానికి హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేశారని మీడియాకు నివేదించింది.

“ఈరోజు [బుధవారం] న్యూఢిల్లీలోని AIlMSలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ హాస్పిటల్ సర్వర్ డౌన్ అయింది, దీని కారణంగా ఔట్ పేషెంట్ మరియు ఇన్‌పేషెంట్ డిజిటల్ హాస్పిటల్ సేవలు, స్మార్ట్ ల్యాబ్, బిల్లింగ్, రిపోర్ట్ జనరేషన్, అపాయింట్‌మెంట్ సిస్టమ్ మొదలైన వాటిపై ప్రభావం పడింది.ఈ సేవలన్నీ ప్రస్తుతం మాన్యువల్ మోడ్‌లో కొనసాగుతున్నాయి." అని ఇన్‌స్టిట్యూట్  పేర్కోంది.

బుధవారం నుంచి ఇప్పటి వరకూ సేవలు మాన్యువల్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. డిజిటల్ సేవలను పునరుద్ధరించడానికి AIlMS..  ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా CERT-IN ల సహాయం కోరుతుంది. CERT-IN అనేది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని నోడల్ ఏజెన్సీ. ఇది ప్రభుత్వ సైట్లను సైబర్ దాడుల నుంచి రక్షిస్తుంది.  సైబర్ దాడి కారణంగా AIlMS లో వైద్య సేవలను తీవ్ర అంతరయం ఏర్పడింది. దీంతో రోగులు ఇన్‌స్టిట్యూట్ ఎదుట బారులు తీరారు.  

ఇదిలాఉంటే.. అక్టోబరులో AIIMS ఢిల్లీ.. జనవరి 1, 2023 నుండి పేపర్‌లెస్‌ కార్యకలాపాలను చేపడుతామని ప్రకటించింది. ఇన్‌స్టిట్యూట్ అధినేత ఎం శ్రీనివాస్..  దీనికి సంబంధించి అన్ని విభాగాల అధిపతులు, కేంద్రాల అధిపతులు,నోడల్ ఆఫీసర్‌లకు ఆఫీస్ మెమోరాండం జారీ చేశారు. అలాగే.. ఏప్రిల్ 1, 2023 నుండి అన్ని చెల్లింపులు పూర్తిగా డిజిటల్‌గా మారుతాయని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ తరుణంలో ఇన్‌స్టిట్యూట్ పై సైబర్ దాడి జరగడం గమనించాల్సిన విషయమే. 


2017లో UK జాతీయ ఆరోగ్య వ్యవస్థ(NHS)పై ransomware సైబర్ దాడి జరిగింది. దాదాపు రెండు వారాల పాటు, మొత్తం వ్యవస్థ డౌన్ అయింది. మాన్యువల్‌గా పని చేయాల్సి వచ్చింది. నాలుగు సంవత్సరాల క్రితం వరకు..భారతదేశంలో 48 వేలకు పైగా 'వైనాక్రై రాన్సమ్‌వేర్ అటాక్స్' కనుగొనబడ్డాయి. ఆ తర్వాత కూడా సైబర్ దాడులను నివారించే ఫూల్‌ప్రూఫ్ వ్యవస్థ దేశంలో తయారు కాలేదు. 

ఈ ఘటనపై డాక్టర్ ముక్తేష్ చంద్ర (IPS) స్పందించారు. ఆయన ఢిల్లీ పోలీస్‌లో స్పెషల్ CP గా విధులు నిర్వహించి..  పదవీ విరమణ చేశారు. అంతేకాదు.. ఆయన గోవా డిజిపి , ఢిల్లీలో స్పెషల్ సిపి 'ట్రాఫిక్'తో సహా అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. డాక్టర్ ముక్తేష్ IIT ఢిల్లీ నుండి సైబర్ సెక్యూరిటీలో PhD చేసారు.

ఆయన మాట్లాడుతూ.. సైబర్ దాడిని నివారించడానికి, 'సైబర్ పరిశుభ్రత' ప్రక్రియను అనుసరించాలి. సంస్థ ఏదైనా కావచ్చు, అక్కడ ప్రతిరోజూ డేటా బ్యాకప్ తీసుకోండి. ప్రతి డిపార్ట్‌మెంట్, ఇన్‌స్టిట్యూషన్ లేదా కంపెనీకి సైబర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గురించి అవగాహన కల్పించాలి. ఎయిమ్స్‌లో ఈ ప్రణాళిక అంతా ఉందా అనేది కూడా ప్రశ్న. ఇది ఒక ఎయిమ్స్‌పై జరిగిన సైబర్ దాడి మాత్రమే. ఇతర AIIMS, పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ సంస్థలు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి సైబర్ దాడి జరిగితే, ఆ సమయంలో భయంకరమైన పరిస్థితిని నెలకొంటుంది. సైబర్ నేరాల పరిధి ఎంత వేగంతో పెరుగుతుందో..అంతే వేగంగా మన భద్రతను మనం పెంచుకోవాలని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios