Asianet News TeluguAsianet News Telugu

ఒకే ఫ్రేమ్‌లో లలిత్ మోడీ, నీరవ్ మోడీ మధ్యలో నరేంద్ర మోడీ.. కామన్ పాయింట్ ఏంటీ : ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో సినీనటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నీరవ్ మోడీ, లలిత్ మోడీ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను పెట్టిన ఆయన వీరి ముగ్గురిలో కామన్ పాయింట్ ఏంటంటూ ట్వీట్ చేశారు. 

actor prakash raj tweet viral
Author
First Published Mar 25, 2023, 8:42 PM IST

సినీనటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను పెట్టి చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ ముగ్గురిలో కామన్‌గా వున్నది ఏంటంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసేలా ఒకే ఫ్రేమ్‌లో ఈ ఫోటో పెట్టారు ప్రకాష్ రాజ్. రాహుల్ గాంధీకి మద్ధతుగా ఆయన ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది.  

కాగా..సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు నుంచి ఆయనను డిస్‌క్వాలిఫై చేశారు. 2019 క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, అనర్హత వేటు మాత్రం తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొనడం గమనార్హం. 

Also Read: మోదీ, అదానీల మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. ఆ భయం ప్రధాని కళ్లలో చూశాను: రాహుల్

శుక్రవారం లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు వివరణ ఉన్నది. కేరళలోని పార్లమెంటు వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిందని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇదిలావుండగా.. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టును ఆశ్రయించారు. ఆర్థిక నేరస్తులను పేర్కొంటూ వీరిందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంటున్నది? అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. దీంతో మోడీ ఇంటి పేరున్న పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. 30 రోజుల పాటు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ రాహుల్ గాంధీకి అవకాశం కల్పించింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios