అజ్ఞాతంలో హత్యాయత్నం నిందితుడు.. 40 యేళ్లుగా టోలీచౌకీలో మకాం..

హత్యాయత్నంలో అరెస్టై.. బెయిల్ మీద బైటికి వచ్చిన ఓ వ్యక్తి తప్పించుకుని హైదరాబాద్ కు వచ్చాడు. గత 40 యేళ్లుగా అచూకీ చిక్కకుండా ఇక్కడే ఉంటున్నాడు. 

Accused of murder attempt Stayed in Tollychowki since 40 years - bsb

హైదరాబాద్ : ముంబైకి చెందిన సయ్యద్ తాహిర్ అనే ఓ 65 ఏళ్ల వ్యక్తిపై ఓ హత్యాయత్నం నేరం ఆరోపణలు ఉన్నాయి. అయితే అతను గత 40 ఏళ్లుగా దొరకకుండా తిరుగుతున్నాడు. ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో అతని మీద హత్యాయత్నం నేరం ఉంది.  ప్రస్తుతం అతను గత 40 ఏళ్లుగా హైదరాబాదులోని టోలిచౌకిలో ఉంటున్నాడు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులు ఒకసారి అతడిని అరెస్టు చేశారు. ఆ తరువాత బెయిల్ పై వచ్చిన అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. ముంబై నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి ఎవరికీ తెలియకుండా జీవిస్తున్నాడు.

ముంబైలోని న్యాయస్థానం సయ్యద్ తాహిర్ మీద స్టాండింగ్ వారెంట్ జారీ చేసింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టి హైదరాబాదులోని టోలిచౌకి ప్రాంతంలో ఆచూకీ కనిపెట్టారు.  ఈ మేరకు శుక్రవారం నాడు మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. అయితే, నేరం జరిగిన 40 ఏళ్ల తర్వాత అరెస్ట్ అవడం.. తాహిర్ కు  హైదరాబాద్ యువతి తోనే వివాహం కావడం.. ప్రస్తుతం కొడుకు కూతుర్లు ఉండడం.. వెలుగులోకి వచ్చింది.

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్..

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తాను అప్పట్లో ఎవరిని హత్య చేయడానికి ప్రయత్నించాడో కూడా తాహెర్ కు గుర్తు లేకపోవడం. తాహీర్  డోంగ్రిలోని కళ్యాణ్ మాన్షనన్ కు చెందిన వ్యక్తి. వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేసేవాడు. చిన్న వివాదం కారణంతో తోటి డ్రైవర్ పై 1982లో హత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత కోర్టును ఆశ్రయించి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఈ హత్యాయత్నం నేరంలో తనకు శిక్ష పడడం ఖాయమని అతడికి అర్థమైంది.

పోలీసులకు దొరకకుండా ఉండడం కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా డోంగ్రి నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడ టోలిచౌకి ప్రాంతంలో స్థిరపడి స్థానికంగా గుర్తింపు కార్డులు కూడా సంపాదించాడు. ఇక్కడికి చెందిన యువతినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం.  అయితే అత్యాయత్నం కేసులో వాయిదాలకు తాహిర్ హాజరు కాకపోవడంతో.. సెషన్స్ కోర్టు సమాన్లు జారీ చేసింది.

ఎలాంటి స్పందన లేకపోవడంతో  మొదట బెయిలబుల్, తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. కానీ తాహిర్ మాత్రం పోలీసులకు ఎంత వెతికినా దొరకలేదు. డోంగ్రిలో ఉన్న అతని కుటుంబ సభ్యులను ఆరా తీసిన కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిమీద న్యాయస్థానం స్పందించి స్టాండింగ్ వారెంట్ జారీ చేసింది.  తాహిర్ కోసం గాలించాలని, దొరికినప్పుడు అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాహిర్ ఆచూకీ కోసం ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటయింది.

పరిశోధనలో భాగంగా తల్లి వివరాలను సేకరించింది. ఆమె నాలుగేళ్ల క్రితం చనిపోయిందని తెలిసింది. మజ్ గావ్ స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగగా దానికి తాహిర్ హాజరైనట్టుగా తెలిసింది. ఆ సమయంలోనే అక్కడ ఉన్న కొంతమంది బంధువులకు తాను హైదరాబాదులో ఉంటున్నానని చెప్పాడని ఈ బృందానికి తెలిసింది.  వెంటనే వారు డోంగ్రి ప్రాంతంలో ఉన్న గూడచారులను అప్రమత్తం చేశారు. వారిలో ఒకరు తాహిర్ చిన్ననాటి స్నేహితుడికి దగ్గరయ్యాడు. విషయమేంటో అతనికి చెప్పకుండా తాహిర్ ఫోన్ నెంబర్ సేకరించాడు. 

దీంతో పోలీసుల గాలింపు సులభమై పోయింది. తాహీర్ హైదరాబాదులోని టోలిచౌకిలో ఉంటున్నట్లుగా గుర్తించి,  గతవారం హైదరాబాదుకు చేరుకున్నారు. అయితే, ఇక్కడ ఎంత వెతికినప్పటికీ తాహిర్ ఆచూకీ దొరకలేదు. ఎలాగైనా తాహిర్ ని పట్టుకోవాలని సిటీలోనే మఖాం వేసిన ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలతో అతడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. లారీ మీద పశ్చిమ బెంగాల్ కు వెళ్లి వస్తున్నట్లు గుర్తించి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన తాహీరును అరెస్టు చేశారు. ముంబైకి తీసుకువెళ్లి సెషన్స్ కోర్టు ముందు హాజరు పరిచారు.

కోర్టు అతడికి ఈ నెల 20 తారీకు వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది.  అయితే తాహీర్ తాను ఎవరితో గొడవ పడ్డానో కూడా తనకు గుర్తు లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకున్నానని.. తనకు నలుగురు సంతానమని పెద్ద కూతురు డెంటల్ డాక్టర్ కాగా, రెండో కూతురు టీచర్ అని, కొడుకు హోం రెనోవేషన్ కాంట్రాక్టర్ అని, చిన్న కూతురు బ్యూటీషియన్ అని చెప్పుకొచ్చాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios