Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని అధికార  బీఆర్ఎస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీని వీడటం ఇబ్బందికరంగా మారుతోంది.

Bodhan Municipal chairperson padma Sharath Reddy will join in Congress ksm
Author
First Published Oct 16, 2023, 10:59 AM IST | Last Updated Oct 16, 2023, 11:15 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని అధికార  బీఆర్ఎస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల చేయడంతో పాటు.. ప్రచారంలో కూడా  ఆ పార్టీ దూసుకుపోతుంది. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీని వీడటం ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ, ఆమె భర్త శరత్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్దమైంది.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగే కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పద్మ శరత్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. వీరితో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios