జగ్‌దీప్ ధన్‌కర్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయడానికి కారణాలు ఏంటని పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంపీ ఎంపీ సౌగతా రాయ్ ప్రశ్నించారు. ఈ సారి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మైనారిటీ వర్గం నుంచి అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేస్తుందని అందరూ అనుకున్నారని, కానీ ఆ నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందని చెప్పారు. 

ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను ఉప రాష్ట్రపతి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంపై టీఎంసీ ఎంపీ సౌగ‌తా రాయ్ బీజేపీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఆ ప‌ద‌వికి ఆయ‌ననే ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏంట‌ని అడిగారు. ‘ ఏ ప్రమాణాల ప్రకారం పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ అభ్యర్థిగా బీజేపీ ఎన్నుకుంది’ అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మైనారిటీ అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేస్తుందని అందరూ భావించారని అన్నారు. అయితే అలాంటివి త‌మ పార్టీకి ఇష్టం లేద‌ని బీజేపీ మ‌రో సారి స్పష్టం చేసింద‌ని అన్నార‌ని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఎన్డీఏ ఆయ‌న‌ను ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని చెప్పారు.

ముగ్గురు సైనికుల‌ను కాల్చి.. అనంత‌రం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఐటీబీపీ జ‌వాన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జేపీ నడ్డా కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లు పాల్గొన్నారు. సమావేశం అయిన ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు జగదీప్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. దీనిని జేపీ నడ్డా మీడియా సమావేశంలో ప్ర‌క‌టించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధులుగా.. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, గవర్నర్లు ఆనందీబెన్ పటేల్, తమిళిసై సౌందరరాజన్, థావర్‌చంద్ గెహ్లాత్‌ల పేర్లు వినిపించినా జేపీ న‌డ్డా ప్ర‌క‌ట‌న‌తో అభ్య‌ర్థిత్వంపై క్లారిటీ వ‌చ్చింది. 

ఐదుగురు గోవా ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించిన కాంగ్రెస్.. రాష్ట్రపతి ఎన్నికల వేళ నిర్ణయం

మరో వైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిత్వం వహించినందుకు జగ్‌దీప్ ధంకర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ప్రశంసించారు. ‘‘ కిసాన్ పుత్ర జగదీప్ ధన్‌ఖర్ జీ తన వినయశీలతకు ప్రసిద్ధి చెందారు. ఆయ‌న తనతో పాటు విశిష్టమైన న్యాయ, శాసన, గవర్నర్ వృత్తిని తీసుకువస్తారు. ఆయ‌న ఎప్పుడూ రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు. ఆయ‌న మ‌న‌కు ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి అయినందుకు ఆనందంగా ఉంది. ’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘ శ్రీ జగదీప్ ధంఖర్ జీకి మన రాజ్యాంగంపై అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. ఆయన శాసన వ్యవహారాల్లో కూడా మంచి ప్రావీణ్యం కలవాడు. ఆయన రాజ్యసభలో అత్యుత్తమ చైర్మన్ గా ఉంటారని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో సభా కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ’’ అని ఆయన అన్నారు. 

Corona Vaccination: 200 కోట్ల మైలురాయికి చేరువలో కరోనా వ్యాక్సినేషన్

ఇదిలా ఉండ‌గా.. ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మ‌డి అభ్యర్థిపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు నేడు (ఆదివారం) స‌మావేశం కానున్నాయి. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖర్గే గ‌త బుధ‌వారం మీడియాతో వెల్ల‌డించారు. ఈ స‌మావేశానికి విప‌క్ష నేత‌లంద‌రూ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు. అన్ని పార్టీల‌తో చ‌ర్చించి అంద‌రికీ ఆమోద్య‌యోగ్య‌మైన అభ్య‌ర్థినే ఎంపిక చేస్తామ‌ని తెలిపారు.