Asianet News TeluguAsianet News Telugu

ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంటే.. స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసిన రైడర్..

ఓ యవతిపై ర్యాపిడో డ్రైవర్ తన ఫ్రెండ్ తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. 

A young woman was raped by a Rapido rider along with his friend
Author
First Published Nov 29, 2022, 2:00 PM IST

భారతదేశపు సిలికాన్ వ్యాలీ సిటీ అని పిలిచే బెంగళూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో (బైక్ ట్యాక్సీ సర్వీస్) బుక్ చేసుకుంది. ఆమెను బైక్ పై ఎక్కించుకెళ్లిన రైడర్ తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది కర్ణాటక రాజధానిలో ఒక్క సారిగా కలకరం రేకెత్తించింది.

చత్తీస్‌గఢ్‌లో పేలిన ఐఈడీ.. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు గాయాలు..

వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ యువతి బెంగళురులో నివసిస్తోంది. అయితే ఆమె తన గమ్యస్థానానికి చేరుకునేందుకు ర్యాపిడో రైడ్ ను బుక్ చేసుకుంది. దీంతో ఆ బైక్ తీసుకొని రైడర్ వచ్చాడు. దీంతో ఆమె బైక్ ఎక్కింది. కానీ ఆ రైడర్ ఆమెను నీలాద్రి నగర్‌లో ప్రాంతానికి తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ‘టైమ్స్ నౌ’నివేదించింది.

కొవిడ్‌ టీకా మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు.. సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

ఈ బైక్ రెంటల్ సర్వీస్‌లో ఇలాంటి కేసు తెరపైకి రావడం ఇదే తొలిసారి. రాపిడో బెంగళూరులో ఉన్న భారతీయ బైక్ టాక్సీ అగ్రిగేటర్, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ. కాగా ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

అయితే ఇదే బెంగళూరు సిటీలో ఓ మహిళ రాపిడో రైడర్ పై నవంబర్ 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు తనపై రెండు వారాల కిందట రైడ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఆ ర్యాపిడో డ్రైవర్ పై ఐపీసీ సెక్షన్ 354ఏ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని, ఆ మహిళ దురుద్దేశంతోనే ఇలా కేసు పెట్టిందని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios