Asianet News TeluguAsianet News Telugu

చత్తీస్‌గఢ్‌లో పేలిన ఐఈడీ.. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు గాయాలు..

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ప్రెజర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. 

CRPF constable injured in IED Blast Chhattisgarh
Author
First Published Nov 29, 2022, 1:51 PM IST

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ప్రెజర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఐఈడీని మావోయిస్టులు అమర్చినట్టుగా పోలీసులు తెలిపారు. ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్గాం గ్రామ సమీపంలోని అడవిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగిందని.. అక్కడ సీఆర్‌పీఎఫ్ 168వ బెటాలియన్‌కు చెందిన బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒక తెలిపారు.

పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న  సమయంలో కానిస్టేబుల్ దీపక్ పాశ్వాన్ ప్రెజర్ ఐఈడీ కనెక్షన్‌పై అడుగు పెట్టాడని చెప్పారు. దీంతో పేలుడు సంభవించిందని.. దీపక్ పాశ్వాన్‌ గాయపడ్డాడని తెలిపారు. వెంటనే పాశ్వాన్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios