గురుగ్రామ్ లో దారుణం జరిగింది. ఓ యువకుడు పదేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఓ యువకుడు 10 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలుడిని హత్య చేశాడు. బాధిత కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు దీనిని కిడ్నాప్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ ప్రాంతం బసాయి గ్రామంలో ఆదివారం నాడు ఓ పదేళ్ల బాలుడు తన ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో ఆ బాలుడికి తెలిసిన 24 ఏళ్ల యువకుడు ప్రిన్స్ వచ్చాడు. కొంత సేపు బాలుడితో ముచ్చటించి, బైక్ పై తనతో బయటకు రావాలని కోరాడు. దీనికి బాలుడు అంగీకరించాడు. నిందితుడు బాలుడిని మనేసర్‌లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే సాయం కోసం బాలుడు కేకలు వేశాడు. దీంతో ఆగ్రహంతో ప్రిన్స్ అతడిని హత మార్చాడు.

గుజరాత్ ఫార్మా కంపెనీలో పేలుడు, ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

అనంతరం డెడ్ బాడీని ఆదివారం సాయంత్రం ఓ డంప్ యార్డ్ లో పారేశాడు. అయితే బాలుడి హత్యపై కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు దీనిని కిడ్నాప్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తన మొబైల్ లో కొత్త సిమ్ వేసి, దాని నుంచి బాలుడి కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. కుమారుడిని కిడ్నాప్ చేశానని, తనకు రూ.2 లక్షలు ఇస్తేనే బాలుడిని వదిలిపెడతానని డిమాండ్ చేశాడు. 

అంత డబ్బు బాధిత కుటుంబం దగ్గర లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సెక్టార్ 10 ఏ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు కాల్ చేసిన నెంబర్ ను ట్రాక్ చేశారు. చివరికి ప్రిన్స్ ఎక్కడున్నాడో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

రొమాంటిక్ గా మొదలై వైలెంట్ గా మారి.. నడివీధిలో ముద్దు గొడవ.. వైరల్ వీడియో..

బాలుడి మృతదేహాన్ని మనేసర్‌లోని చెత్త డంప్ నుండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు సేకరించారు. పోస్టుమార్టం నివేదికలో బాలుడిపై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి సోదరుడు బాలుడి కుటుంబానికి పొరుగునే నివసిస్తాడు. అందుకే ప్రిన్స్ బాధిత కుటుంబానికి తెలుసు. అందుకే అతడు పిలిచినప్పుడు బాలుడు ఎలాంటి అనుమానమూ లేకుండా వెళ్లిపోయాడని ఏసీపీ (క్రైమ్) ప్రీత్ పాల్ సంగ్వాన్ తెలిపారు.

నిందితుడి అరెస్టు చేసిన తరువాత స్థానిక కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఒక రోజు పోలీసు రిమాండ్ కు తరలించారు. అయితే ప్రిన్స్ కు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు ఇంకా గుర్తించలేదని ఏసీపీ తెలిపారు. కాగా.. బాలుడి తండ్రి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్నాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. అపరిచితులతో మాట్లాడకూడదని తాము కుమారుడికి నేర్పించామని, కానీ పరిచయం ఉన్న వ్యక్తే ఇలా చేస్తే పిల్లలను తల్లిదండ్రులు ఎలా కాపాడుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబైలోకి ఉగ్రవాది మెమన్: ఎన్ఐఏకి మెయిల్ , అప్రమత్తమైన పోలీసులు

కాగా.. భారత్ తో పాటు విదేశాల్లోని పిల్లలపై జరుగుతున్న నేరాల్లో ఎక్కువ భాగం కుటుంబానికి తెలిసినే వారే చేస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీ ఆర్ బీ) ప్రకారం.. హర్యానాలో 2021లో పిల్లలపై 5,700 నేరాల కేసులు నమోదయ్యాయి. 2020లో 4,338 కేసులు నమోదు అయ్యాయి. ఏడాది కాలంలోనే ఇలాంటి నేరాలు దాదాపు 30 శాతం పెరిగాయి.