వల్సాద్ జిల్లాలోని సరిగామ్ జిఐడిసి కెమికల్ జోన్‌లోని వాన్ పెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

గుజరాత్ : గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వల్సాద్ జిల్లాలోని సరిగామ్ జిఐడిసి కెమికల్ జోన్‌లోని వాన్ పెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భవనంలో కొంత భాగం శిథిలంగా మారింది.

గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. అయితే, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగించలేకపోయారు, ఎందుకంటే మంటలు చెలరేగడానికి ముందు పేలుడుకు కారణమైన రసాయనం గురించి వారికి తెలియదు.

తమిళనాడులో కారు, కంటైనర్ ఢీ: ఐదుగురు మృతి

"అగ్నిప్రమాదం జరిగినట్లు మాకు కాల్ వచ్చింది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. అగ్నిమాపక సిబ్బందితో మేము ఇక్కడికి చేరుకునే సరికి భద్రతా సిబ్బంది లేరు. దీంతో మంటలు ఆర్పే పనిని వెంటనే ప్రారంభించలేదు. కంపెనీలో ఏ రసాయనం ఉంది, ఏది మంటలకు కారణమైందో ఖచ్చితంగా తెలియలేదు" అని అగ్నిమాపక సిబ్బందిలో ఒకరైన రాహుల్ మురారి తెలిపారు.

"నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో సరిగమ్ జిఐడిసిలోని ఒక కంపెనీలో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించారు ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు" అని వల్సాద్ ఎస్పీ విజయ్ సింగ్ గుర్జార్ తెలిపారు, రెస్క్యూ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి ఉదయం పునఃప్రారంభించబడింది. పేలుడు వెనుక కారణం, ఫ్యాక్టరీ లోపల కార్మికుల పరిస్థితి ఇంకా పూర్తిగా తెలియదు. మరింత సమాచారం కోసం అందాల్సి ఉంది.