రొమాంటిక్ గా మొదలై వైలెంట్ గా మారి.. నడివీధిలో ముద్దు గొడవ.. వైరల్ వీడియో..
ఓ వాలెంటైన్స్ డే వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ గా మారింది. ఇద్దరు లవర్స్ నడివీధిలో పిడిగుద్దులు కురిపించుకున్నారు.
ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నడివీధిలో రొమాన్స్ చేద్దామని ప్రయత్నించిన ఓ జంట జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లడం.. చూసిన వారందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. రొమాంటిక్ గా మొదలై వైలెంట్ గా మారిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులందరూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ లవర్స్ కి ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చి.. వారితో ఆ రోజంతా ప్రత్యేకంగా గడిపి.. తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఇంకొంతమంది ఇదే సమయంలో ఇంకాస్త ముందడుగేసి.. నడి వీధుల్లోనే ముద్దులు, హగ్గులతో ఘాటు రొమాన్స్ కు తెరలేపారు.
నేటిజెన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోలో అసలు ఏముందంటే… ఓ యువతి బైక్ మీద కూర్చుని ఉంటుంది. ఆమె ముందు నిల్చున్న ప్రియుడు ఆమెకు దగ్గరగా జరిగి.. ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. దీనికి ఆమె.. సున్నితంగా తిరస్కరించింది. వద్దంటూ వారించింది. కానీ ప్రియుడు అంతటితో ఆగలేదు.. రెండోసారి కూడా ప్రయత్నించాడు. దీంతో ఆమెకు చిరాకు వచ్చింది. ఆ చిరాకునే ప్రియుడి మీద ప్రదర్శించింది.
ప్రియురాలు చిరాకు కోపం తెప్పించి ప్రియుడు ఆమెను కొట్టాడు. అనుకోని ఈ పరిణామానికి షాక్ అయిన ప్రియురాలు ఏమీ ఊరుకోలేదు.. ఆమె కూడా అతడిని వెనక్కి నెట్టి పంచ్ ల వర్షం కురిపించింది. దీంతో ప్రియుడు ఎదురు కొట్టడం మొదలుపెట్టాడు. అలా ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. రొమాంటిక్ గా మొదలై.. వైలెంట్ గా ముగిసిన ఈ ఈ స్టోరీ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. దీంతో వీడియో వైరల్ గా మారింది.