Asianet News TeluguAsianet News Telugu

దుర్గా పూజకు చందా ఇవ్వ‌లేద‌ని మ‌హిళ‌ను దారుణంగా కొట్టి హ‌త్య‌.. ఎక్క‌డంటే ?

దుర్గా మాత విగ్రహం ప్రతిష్టించేందుకు చందా ఇవ్వకున్నా.. పూజ చేసేందుకు వచ్చిందని ఓ మహిళను పలువురు మహిళలు, నిర్వాహకులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. 

A woman was brutally beaten to death for not paying for Durga Puja. Where is it?
Author
First Published Oct 6, 2022, 4:01 PM IST

పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దుర్గా పూజ కోసం చందా చెల్లించకుండా ప్రార్థన చేసేందుకు మండ‌పం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన 45 ఏళ్ల గృహిణిని చిత‌క‌బాదారు. వెదురు క‌ర్ర‌ల‌తో, పిడి గుద్దుల‌తో ఆమై దాడి చేశారు.ఆ దెబ్బ‌ల బాధ త‌ట్టుకోలేక బాధిత మ‌హిళ చ‌నిపోయంది. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌లో మంగ‌ళ‌వారం జరిగింది.

అయ్యే.. ఏందయ్య ఇది.. ప్ర‌క‌టించిన రోజేనే పార్టీ పేరు మ‌ర్చిపోతిరా? టీఆర్ఎస్ మంత్రిపై నెట్టింట ట్రోల్స్

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..  ముర్షిదాబాద్ జిల్లా సన్యాసిదంగా గ్రామానికి చెందిన సుచిత్రా మోండ‌ల్ ఓ గృహిణి. అయితే ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా స్థానికంగా దుర్గా దేవి విగ్ర‌హాన్ని ప్రతిష్టించారు. దీని కోసం ఆ గ్రామ‌స్తులు చందాలు వ‌సూలు చేశారు. కానీ సుచిత్రా మోండ‌ల్ కుటుంబం చందా ఇవ్వ‌లేదు. ఈ విష‌యంలో ప‌లువురు ఆమెపై ఆగ్ర‌హంగా ఉన్నారు. 

అయితే ఆ గ్రామంలోని అంద‌రిలాగే బాధిత మ‌హిళ సుచిత్రా మోండ‌ల్ కూడా మంగ‌ళ‌వారం సాయ‌త్రం ప్రార్థ‌న చేయ‌డానికి పూజా మండ‌పం వ‌ద్ద‌కు వ‌చ్చింది. అయితే అక్క‌డే ఉన్న ఓ వ‌ర్గం మ‌హిళ‌లు, పూజా నిర్వాహ‌కులు ఆమెను చూశారు. దుర్గామాత విగ్రహం వైపున‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రామ‌స్తులంతా చందా చెల్లించ‌లేదని, ఒక్క మీ కుటుంబం మాత్ర‌మే చందా ఇవ్వ‌లేద‌ని తెలిపారు. కాబ‌ట్టి దుర్గా దేవి వ‌ద్ద పూజ‌కు అనుమ‌తించ‌బ‌మ‌ని ఆమెకు తేల్చి చెప్పారు. 

కర్ణాటకలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తాం: జేడీఎస్ నేత కుమారస్వామి

కానీ సుచిత్ర ఆ మండ‌పం ద‌గ్గ‌ర నుంచి వెనుదిర‌గ‌డానికి నిరాక‌రించింది. తాను క‌చ్చితంగా ప్రార్థ‌న చేసే వెళ్తాన‌ని చెప్పింది. దీంతో ఆమెకు, మ‌రి కొంద‌రు మ‌హిళ‌ల‌కు వాగ్వాదం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో కొంద‌రు సుచిత్రపై దాడి చేశారు. ఆ దెబ్బ‌ల నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. అయినా దాడి ఆగ‌క‌పోవ‌డంతో బాధితురాలు మృతి చెందింది. 

అయితే సుచిత్రను ఇరుగుపొరుగు వారు రక్షించి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ అక్క‌డ చిక‌త్స పొందుతున్న స‌మ‌యంలో ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందారు. బాధితురాలు తల, ఛాతీపై గాయాలు అవడం వల్ల ఆమె మృతి చెందింద‌ని పోస్టుమార్టం నివేదిక స్ప‌ష్టం చేసింద‌ని పోలీసులు తెలిపారు. 

మైనర్ కూతురిపై అత్యాచారం.. కేసు పెట్టిన రెండునెలలకు బాలిక తండ్రి హత్య.. ఎవరు చేశారంటే...

ఈ ఘ‌ట‌న‌పై మృతురాలి మేన‌ల్లుడు మృణ్మయ్ మోండల్ మాట్లాడుతూ.. దుర్గా మాత విగ్ర‌హం ద‌గ్గ‌ర‌కు వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని పూజ నిర్వాహకులు తన అత్తను బెదిరించారని తెలిపారు. కానీ ఆ హెచ్చ‌రిక‌ను త‌న అత్త ప‌ట్టించుకోలేద‌ని, దీంతో కొంతమంది మహిళలు పూజ నిర్వాహకులు వ‌చ్చి కొట్ట‌డం ప్రారంభించార‌ని చెప్పారు. తన అత్త దెబ్బ‌ల వ‌ల్ల నేలమీద ప‌డ్డా కూడా వాళ్ళు వదలలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ దాడి స‌మ‌యంలో వెదురుక‌ర్ర‌ల‌ను కూడా ఉప‌యోగించార‌ని ఆయ‌న తెలిపారు. ప‌లువురు గ్రామ‌స్తులు జోక్యం చేసుకొని త‌న అత్త‌ను ర‌క్షించేందుకు స‌హాయం చేశార‌ని తెలిపారు. కాగా.. సుచిత్ర మోండ‌ల్ మృతికి కార‌ణ‌మైన వారింద‌రిపై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. కాగా.  ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు మ‌రో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios