Asianet News TeluguAsianet News Telugu

మైనర్ కూతురిపై అత్యాచారం.. కేసు పెట్టిన రెండునెలలకు బాలిక తండ్రి హత్య.. ఎవరు చేశారంటే...

మైనర్ కూతురి మీద అత్యాచారం చేశాడని ఓ తండ్రి కేసు పెట్టాడు. దీంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడి కొడుకు ఆ తండ్రిని హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. 

father of molested minor girl killed by accused son in rajasthan
Author
First Published Oct 6, 2022, 2:16 PM IST

రాజస్థాన్ : రాజస్థాన్ లోని అజ్మీర్ లో అత్యాచార బాధితురాలి తండ్రిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.   నిందితుడు తన సహచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన తండ్రిపై అత్యాచార నేరంకింద కేసు నమోదు చేయడం,  ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో మనస్థాపానికి గురైన నిందితుడు ప్రతీకారంతో ఈ హత్యకు పాల్పడ్డాడు. అరెస్టు చేసిన నిందితులు ఇద్దరినీ ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారి, ఎస్సీ ఎస్టీ సెల్  డి.ఎస్.పి రమావతార్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం...  

మృతుడు ధనోప్ మాతా వద్దకు వెళ్లినట్లు తెలుసుకున్న, అమర్ పురా నివాసి కైలాస్ గుల్జార్ (32), అతని సహచరుడు బగ్రాయ్ నివాసి సజ్జన్ జాట్ (39) కలిసి దారిలో అతనిని పదునైన ఆయుధంతో హత్య చేశారు. మృతుని బంధువుల తరపున అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను విచారించగా వారు నేరం అంగీకరించారు. వారు వినియోగించిన కారు, కత్తి,  మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

నా కోసం సీఎం కుర్చీని వ‌దులుకున్నా.. నితీష్ కుమార్ కోసం ప‌నిచేయ‌ను: ప్ర‌శాంత్ కిషోర్

ఘటన వివరాలు  ఇవే..
అజ్మీర్ లోని భినయ్ సబ్ సబ్ డివిజన్ లోని పంచాయతీ గుడ్డా ఖుర్ద్ కు చెందిన బాగ్రాయ్ గ్రామ పచ్చిక బయళ్ళలో 35యేళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అక్కడికి సమీపంలోని గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి ఒంటిపై పదునైన ఆయుధంతో నరికిన గుర్తులు ఉన్నాయి.  అటువంటి పరిస్థితిలో పోలీసులు ప్రాథమికంగా హత్య కేసుగా పరిగణించి, దర్యాప్తు ప్రారంభించారు.

జూలై 26, 2022న మృతుడి మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. నెల రోజుల తర్వాత అత్యాచార నిందితుడి శ్రవణ్ విషం తాగాడు. జవహార్ లాల్ నెహ్రూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అతని కుటుంబసభ్యులు తమకు రూ. 80 లక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఇందుకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.  

అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి గ్రామస్తులు అంగీకరించారు. తాజాగా జరిగిన హత్య కేసుతో పోలీసులు నిందితులను విచారించగా.. వారు నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios