Asianet News TeluguAsianet News Telugu

అయ్యే.. ఏందయ్య ఇది.. ప్ర‌క‌టించిన రోజేనే పార్టీ పేరు మ‌ర్చిపోతిరా? టీఆర్ఎస్ మంత్రిపై నెట్టింట ట్రోల్స్

Bharat Rashtra Samithi: తెలంగాణ ముఖ్య‌మంత్రి జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ విస్తృత స్థాయి కార్య‌వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా దానికి సంబంధించిన వివ‌రాల‌ను బుధ‌వారం మీడియాకు వెల్ల‌డించారు. అయితే, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు సంబంధించిన ఒక ప్ర‌సంగం ట్రోల్స్ కు గుర‌వుతూ వైర‌ల్ గా మారింది. 
 

Bharat Rashtra Samithi: TRS minister Errabelli Dayakar Rao forgets name of KCRs new party on stage; viral video
Author
First Published Oct 6, 2022, 3:08 PM IST

TRS minister Errabelli Dayakar Rao:  తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొత్తగా రీబ్రాండెడ్ అయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును మ‌ర్చిపోయార‌నే విధంగా ఉన్న ఒక వీడియో ప్ర‌సంగం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరును మ‌ర్చ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్త పార్టీ పేరును సైతం ద‌స‌రా సంద‌ర్భంగా బుధ‌వారం ప్ర‌క‌టించారు. అయితే, టీఆర్ఎస్ మంత్రి ఎర్ర‌బెట్టి ద‌యాక‌ర్ రావు ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ కొత్త పార్టీ పేరును మ‌ర్చిపోయార‌నే విధంగా న‌డుచుకున్నారు. దీంతో  ఆయ‌న‌ను అయ్యే.. ఏందే ద‌యాక‌ర‌న్న ప్ర‌క‌టించిన రోజేనే పార్టీ పేరు మ‌ర్చిపోతిరా?  అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ అధికార పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ విస్తృత స్థాయి కార్య‌వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా దానికి సంబంధించిన వివ‌రాల‌ను బుధ‌వారం మీడియాకు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ఇప్ప‌టి నుంచి  భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) మారుతుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అయితే, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు సంబంధించిన ఒక ప్ర‌సంగం ట్రోల్స్ కు గుర‌వుతూ వైర‌ల్ గా మారింది. ఆయ‌న త‌మ కొత్త పార్టీ పేరును అక్క‌డి కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారితో గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అక్క‌డి గుంపులోని ఒక స‌భ్యుడు బీఎస్పీ అంటూ  చెప్ప‌డంతో మంత్రి ఎర్ర‌బెల్లి కూడా అదే పేరును ప్ర‌స్తావిస్తూ ద‌స‌రా రోజు కొత్త పార్టీ అంటూ చెప్పుకొచ్చారు.

19 సెకండ్ల నిడివి గ‌ల ఆ వీడియో క్లిప్ లో మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు మాట్లాడుతున్నారు. "తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. కేసీఆర్, కేటీఆర్ గారి నాయ‌క‌త్వం లోప‌ట ఇయాల భార‌తీయ‌.. ఏ పార్టీ పెట్టిర‌య్యా?... అంటూ ప్ర‌జ‌ల నుంచి స‌మాధానం కోర‌గా.. ఒక‌రు బీఎస్పీ అంటూ స‌మాధాన మించారు. మంత్రి ఎర్ర‌బెల్లి కూడా బీఎస్పీ అంటూ.. జాతీయ పార్టీగా ఇయాల ముఖ్య‌మంత్రి గారు ప్ర‌క‌టించారు. శుభ‌దినం.. "అంటూ మంత్రిగారి ప్ర‌సంగం కొన‌సాగింది.  ఈ వీడియో పై రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ, “తెలంగాణ ప్రజల హృదయ స్పందనను ప్రజలకు తెలియజేసినందుకు” మంత్రికి ధన్యవాదాలు  అంటూ ట్వీట్ చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం తన ట్వీట్‌లో బీఆర్‌ఎస్ పార్టీని, దాని విజన్‌ను పై విమర్శలు గుప్పించారు.

 

“టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకోవడం వారి అంతర్గత విషయం, అయితే 1300 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలతో విందు చేస్తున్న భూస్వామ్య కుటుంబం నేతృత్వంలోని ఈ బీఆర్‌ఎస్ పట్ల భారతదేశం జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరించడానికి కట్టుబడి ఉన్నాను. మీ ఇళ్లకు తాళాలు వేయడం మర్చిపోవద్దు. మెరిసేదంతా బంగారం కాదు' అని వ్యాఖ్యానించారు.

తనను తాను జాతీయ క్రీడాకారుడిగా అభివర్ణించుకుని, బీజేపీ వ్యతిరేక నేతలను కలిసేందుకు రాష్ట్రాల్లో పర్యటిస్తూ నెలల తరబడి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జాతీయ పార్టీని ప్రారంభించారు. దీనికి సంబంధించి పార్టీ జనరల్ బాడీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా పిలవబడే జాతీయ పార్టీ ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ పంపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వెలుపల బాణాసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పొడిగించిన కార్యవర్గ సమావేశం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన జ‌రిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, జిల్లా యూనిట్ల అధ్యక్షులు సహా దాదాపు 280 మంది పార్టీ నాయకులు హాజరయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios