Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తాం: జేడీఎస్ నేత కుమారస్వామి


బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విజయవంతం కావాలనే ఆకాంక్షను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యక్తం చేశారు. 

JD( S )will work with BRS  says H D Kumaraswamy
Author
First Published Oct 6, 2022, 3:17 PM IST

బెంగుళూరు:కర్ణాటకలో బీఆర్ఎస్ తో  కలిసి పనిచేస్తామని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. గురువారం నాడు జేడీఎస్  నేత కుమారస్వామి బెంగుళూరులో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో కలిసి పని చేస్తారన్నారన్నారు.దేశమంతాతెలంగాణ పథకాలు అమలుచేయాల్సిన అవసరం ఉందనిఆయన అభిప్రాయపడ్డారు. 

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ నెల 5వ తేదీన  పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి జేడీఎస్ నేత  కుమారస్వామి కూడా హాజరయ్యారు. జేడీఎస్ నేత కుమారస్వామి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఈ సమావేశానికి హాజరయ్యారు. 

 జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మార్చారు.టీఆర్ఎస్ పేరు మారుస్తూ చేసినతీర్మానం ప్రతిని బీఆర్ఎస్  నేతలు ఇవాళ ఈసీ అధికారులకు అందించారు. 

టీఆర్ఎస్  ను బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడానికి కనీసం నెల రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో తమమిత్రపక్షాలతో  వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని కేసీఆర్  భావిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో  ఆ పార్టీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్  వాఘేలా ఇటీవల కేసీఆర్ తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. గుజరాత్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. 

also read:న్యూఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీస్: స్వంత భవన పనులు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశం

బీఆర్ఎస్ ను  ఏర్పాటు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర నుండి తన పర్యటనను ప్రారంభించాలని  కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా విమానం కొనుగోలు  చేశారు. 

2018 నుండి జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని భావించారు. అయితే ఫ్రంట్ కంటే జాతీయ పార్టీ ఏర్పాటుతో ప్రయోజనం ఉంటుందని భావించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని  కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios