చోరీ చేసేందుకు రాత్రి సమయంలో ఇంట్లోకి దూరిన ఓ దొంగ అక్కడున్న ఓ మద్యం బాటిల్ చూసి తాగాడు. మత్తులో అక్కడే నిద్రపోయాడు. దీంతో తెల్లారిపోయింది. స్థానికులు గమనించి అతడిని పోలీసులకు అప్పగించారు.
మనం ఎన్నో దొంగతనాల గురించి విని ఉంటాం.. ప్రతీ రోజూ చోరీల గురించి పేపర్లలోనో లేదా టీవీల్లోనే చూస్తుంటాం. వాటిల్లో కామన్ గా ఉండే పాయింట్ ఏంటంటే.. ఎవరూ ఇంట్లో లేని సమయంలో దొంగలు లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులు, డబ్బులు, నగలు ఎత్తికెళ్లిపోతుంటారు. మరి కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎవరైనా ఉన్నప్పటికీ చడీచప్పుడు చేయకుండా వారి పని వారు చేసుకుపోతుంటారు. తెల్లారి లేచి చూసిన కుటుంబ సభ్యులకు చోరీ జరిగిన విషయం తెలుస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ దొంగ ఇలా చడీచప్పుడు లేకుండా దొంగతనం చేద్దామనే వచ్చినా.. అక్కడ ఉన్న మద్యం బాటిల్ చూసి టెంప్ట్ అయ్యాడు. బాటిల్ ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టాడు. తరువాత ఏం జరిగిందంటే ?
అమానుషం : అత్యాచార బాధితురాలైన కూతురికి ప్రసవం చేసి... నవజాత శిశువు తలనరికి, కాలువలో పడేసిన తండ్రి..
ప్రియాంక్ అనే నిందితుడిది ఉత్తరప్రదేశ్ లోని సినౌలీ గ్రామం. అతడు దొంగతనం చేద్దామని నిర్ణయించకొని గత ఆదివారం రాత్రి ఓ ఇంటికి వెళ్లాడు. మెల్లగా చప్పుడు చేయకుండా గోడ దూకాడు. అంతే సైలెంట్ గా ఇంట్లోకి చొరబడ్డాడు. విలువైన వస్తువులు, డబ్బులు, నగలు ఎక్కడ ఉన్నాయా అని వెతకడం ప్రారంభించాడు. కానీ వాటి జాడ దొరక్క ముందే మనోడికి ఓ మద్యం బాటిల్ కనిపించింది.
తమిళనాడులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిషేధ బిల్లు.. పునః పరిశీలనకు పంపిన గవర్నర్
ఇంకేముంది దానిని చూసిన ప్రియాంక్ కు నోరు ఆగలేదు. దాని సంగతేంటో చూడాలని తహతహలాడాడు. వచ్చిన పనేంటో కూడా మర్చిపోయాడు. మెల్లగా మొదలుపెట్టి బాటిల్ మొత్తం ఖాళీ చేసేశాడు. ఇక బాడీ బయటకు వెళ్లేందుకు సహకరించలేదు. మత్తులో అక్కడే తూలిపోతూ మెళ్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక నిద్రలో నుంచి మెలుకవ వచ్చింది. కానీ అప్పటికే పూర్తిగా తెల్లారిపోయింది. అప్పుడు అతడికి రాత్రి జరిగిన విషయమంతా గుర్తొచ్చింది.
లాయర్ కిరాతకం... ప్రేమను రిజెక్ట్ చేసిందని మహిళా న్యాయవాదిమీద దాడి.. ముక్కుకొరికేసి పైశాచికం..
వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలని అనుకున్నాడు. వెంటనే గోడ దగ్గరకు వెళ్లి పారిపోయిందేకు ట్రై చేశాడు. కానీ అతడిని చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు గమనించారు. గోడ దూకుతుండగా వారంతా చుట్టుపక్కల వారు వచ్చి పట్టుకున్నారు. తరువాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకొని ప్రియాంక్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ దొంగతనం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
