అత్యాచార బాధితురాలైన కూతురి మీద కిరాతకంగా వ్యవహరించాడో తండ్రి. ఆమెకు స్వయంగా డెలివరీ చేశాడు. ఆ తరువాత పుట్టిన శిశువును చంపేశాడు. 

గుజరాత్ : ఓ తండ్రి తన కూతురి పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెకు స్వయంగా ప్రసవం చేయడమే కాకుండా పుట్టిన బిడ్డను.. అత్యంత అమానుషంగా చంపేశాడు. ఈ ఘటన గుజరాత్ లోని పటాన్ జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఓ బాలికపై కొద్ది నెలల క్రిందట ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఆమెను బయటకు తీసుకువెళితే అందరికీ విషయం తెలుస్తుందని.. తండ్రి ఎనిమిదిన్నర నెలల గర్భంతో ఉన్న బాలికకు.. ఇంట్లోనే.. తానే స్వయంగా ప్రసవం చేశాడు.

ఆ తర్వాత పుట్టిన బిడ్డ ఏడుస్తుందని ఆ బిడ్డ గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగలేదు. అమానుషంగా వ్యవహరించాడు. శిశువు తలను కత్తితో నరికాడు. దగ్గరలోని కాలువలో పడేసాడు. అయితే, అత్యాచారం మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానిమీద దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల మరోసారి వైద్య పరీక్షల కోసం బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

తమిళనాడులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ నిషేధ బిల్లు.. పునః పరిశీలనకు పంపిన గవర్నర్

అంతకుముందు వరకు బాలిక గర్భంతో ఉన్న సంగతి వారు గమనించారు. ఈసారి బాలిక కడుపులో పిండం లేదని వైద్యులు గుర్తించడంతో ఏం జరిగిందని బాలికను విచారించారు. దీంతో ఆ బాలిక తండ్రి చేసిన దారుణాన్ని వారికి చెప్పింది. పుట్టిన వెంటనే బిడ్డ ఏడుస్తుండడంతో.. ఇరుగుపొరుగు వారికి ఈ విషయం తెలిసిపోతుందనే భయంతోనే తండ్రి నవజాత శిశువును చంపినట్లు వివరించింది. బాలిక వాంగ్మూలం మేరకు పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేశారు. ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అప్పటికే అరెస్టు చేసినట్లుగా కూడా పోలీసులు చెప్పుకొచ్చారు.