Asianet News TeluguAsianet News Telugu

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసిలో జిల్లాలో ఓ కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. 

A terrible road accident.. a car collided with a truck.. 8 members of the same family were killed..ISR
Author
First Published Oct 4, 2023, 1:57 PM IST

ఓ కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

సెక్స్ లో పాల్గొనాలని బాలుడిపై యువకుడి ఒత్తిడి.. వినకపోవడంతో దారుణ హత్య..

పిలిభిత్‌ కు చెందిన ఓ కుటుంబం అంతా వారణాసిలోని పుణ్యక్షేత్రాలను దర్శిచేందుకు కారులో బయలుదేరింది. వారణాసిలో పూజలు నిర్వహించిన అనంతరం కారులో తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారి వాహనం వారణాసి-లక్నో హైవేపై వారణాసి జిల్లాలో ఉన్న జౌన్‌పూర్ ప్రాంతానికి చేసుకుంది. ఈ క్రమంలో అక్కడ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది.

జాక్ పాట్ అంటే ఇదే.. రూ.100తో లాటరీ టికెట్ కొని.. రూ.కోటిన్నర గెలుచుకున్న స్నేహితులు.. (వీడియో)

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పిండ్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతులను అమన్ (24), విపిన్ యాదవ్ (32), గంగాదేవి (48), మహేంద్ర పాల్ (43), చంద్రకాళి (40), దామోదర్ ప్రసాద్ (35), నిర్మలా దేవి (32), రామ్ భజన్ (55)గా గుర్తించారు. అయితే ప్రాణాలతో బయటపడిన ఐదేళ్ల శాంతి స్వరూప్ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది.

విషాదం.. ఊయల తాడు మెడకు చుట్టుకొని పదేళ్ల బాలుడు మృతి

కాగా.. ఈ రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios