Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ లో పాల్గొనాలని బాలుడిపై యువకుడి ఒత్తిడి.. వినకపోవడంతో దారుణ హత్య..

తనతో సెక్స్ లో పాల్గొనాలని ఓ యువకుడు బాలుడిని కోరాడు. కానీ బాలుడు దానిని తిరస్కరించాడు. చివరికి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో బాలుడిని యువకుడు దారుణంగా హత్య చేశాడు.

The young man pressured the boy to have sex.   Brutal murder due to not listening..ISR
Author
First Published Oct 4, 2023, 1:16 PM IST

ఆ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంకా ఉద్యోగం రాలేదు. ఈ క్రమంలో 12వ తరగతి చదవుతున్న బాలుడితో పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో బాలుడిని ఇంటికి పిలిపించుకొని తనతో సెక్స్ లో పాల్గొనాలని కోరాడు. కానీ దానిని ఆ బాలుడు తిరస్కరించాడు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు.. రకరకాలుగా ఆ బాలుడిని బ్లాక్ మెయిల్ చేసి చివరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలూరు జిల్లాలో కు చెందిన అనంత్ ఇంజనీరింగ్ చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. అయితే అతడికి 17 ఏళ్ల జీవాతో కొంత కాలం కిందట పరిచయం ఏర్పడింది. ఆ బాలుడు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం అనంత్ జీవాను తన ఇంటికి పిలిపించుకున్నాడు. బాలుడితో శృంగారంలో పాల్గొనడానికి ప్రయత్నించాడు. కానీ అతడి ప్రపోజల్ ను జీవాను తిరస్కరించాడు. 

అయితే ఇన్ స్టాగ్రామ్ లో తనకు పరిచయమైన అమ్మాయి ఫోటోలను జీవా తన మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని ఉంచాడు. ఆ ఫొటోలను అనంత్ గమనించాడు. ఆ వాటిని స్క్రీన్ షాట్స్ తీసి జీవాకు తెలియకుండా షేర్ చేసుకున్నాడు. వాటి ఆధారంగా బ్లాక్ బెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తన ప్రపోజల్ కు లొంగిపోవాలని, లేకపోతే ఆ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. 

అయితే ఇటీవల జీవా అనంత్ ఫోన్ తీసుకుని పగులగొట్టాడు. ఇది వారి మధ్య గొడవకు దారి తీసింది. దీంతో అనంత్ కోపంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జీవా మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్తుండగా.. అనంత్ వెనక నుంచి వచ్చి కత్తితో మెడపై, ఛాతీపై దాడి చేశాడు. అటుగా వెళ్తున్న వారు జీవాను గమనించారు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios