టెక్నాలజీ పెరిగినా.. కాలం మారినా కొందరి ఛాదస్తం మాత్రం మారడం లేదు. ఇంకా పాత కట్టుబాట్లనే పాటించాలని కోరుకుంటున్నారు. పీరియడ్స్ లో ఉన్న బాలికలకు ఓ ఉపాధ్యాయుడు విచిత్రమైన ఆదేశాలు జారీ చేశాడు. మొక్కలు నాటకుండా అడ్డుకున్నాడు. 

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ప్రభుత్వ ఆధీనంలో న‌డిచే ఓ స్కూల్ లో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడు పీరియ‌డ్స్ లో ఉన్న ఓ గిరిజ‌న విద్యార్థిణితో పాటు మ‌రి కొంద‌రు బాలిక‌ల‌ను మొక్క‌లు నాట‌కుండా అడ్డుకున్నాడు. రుతుక్ర‌మంలో ఉన్న స‌మ‌యంలో మొక్క‌లు నాటితో అవి కుళ్లిపోతాయ‌ని, పెర‌గ‌వ‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌పై గిరిజ‌న విద్యార్థిణి ఫిర్యాదు చేసింది. దీంతో గిరిజనాభివృద్ధి శాఖ దీనిపై విచార‌ణ‌కు ఆదేశించింది. 

దుమారం రేపుతున్న అధీర్ చౌదరి కామెంట్స్.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్.. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్..

ఆ విద్యార్థిణి త‌న ఫిర్యాదులో.. ‘‘ బహిష్టు సమయంలో అమ్మాయిలు మొక్కలు నాటితో కుళ్లిపోతాయి. అలాగే వాటిలో ఎదుగుద‌ల ఉండ‌దు ’’ అని తనతో పాటు ఇతర బాలికలకు కూడా చెప్పారని పేర్కొంది. ఫిర్యాదు చేసిన బాలిక త్రయంబకేశ్వర్ తాలూకాలోని దేవ్‌గావ్‌లోని సెకండరీ, హయ్యర్ సెకండరీ ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది. ఈ విషయంపై ఫిర్యాదు అందినట్లు గిరిజనాభివృద్ధి శాఖ (TDD) సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.

బాలికతో మిగితా విద్యార్థిణులు, ఉపాధ్యాయులు, సూపరింటెండెంట్‌, ప్రిన్సిపాల్‌తో పాటు అంద‌రి వాంగ్మూలాలను నమోదు చేసి, విచారణ జరుపుతామని అదనపు కమిషనర్‌ సందీప్‌ గోలాయిత్‌ తెలిపారు. కాగా.. బుధవారం నాసిక్ జిల్లా అదనపు జిల్లా అధికారిణి, TDD ప్రాజెక్ట్ అధికారి వర్ష మీనా పాఠశాలలో విద్యార్థినిని కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

PM Modi: గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని.. ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్న మోడీ

గత వారం పాఠశాల ఆవరణలో మొక్క‌ల పెంప‌కం కార్య‌క్రమం నిర్వహించార‌ని, ఆ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిపారు. కాగా దీనికి ముందు బాలిక శ్రమజీవి సంఘటన్ నాసిక్ జిల్లా కార్యదర్శి భగవాన్ మాధేను సంప్రదించింది. ఆ ఉపాధ్యాయుడి చేతిలో 80 శాతం ఇంట‌ర్న‌ల్ మార్క్స్ ఉండ‌టం వ‌ల్ల విద్యార్థిణి అత‌డిని ఎదురించ‌లేక‌పోయింద‌ని ౠయ‌న తెలిపారు. ఈ విష‌యంలో ఉపాధ్యాయుడు కూడా ప‌దే ప‌దే విద్యార్థిణిని ప‌దే ప‌దే బెదిరించాడ‌ని ఆరోపించారు. తాను గోలాయిత్‌తో ఫోన్‌లో మాట్లాడానని, జూలై 26వ తేదీన బాలికతో కలిసి నాసిక్‌లోని ఆదివాసీ వికాస్ భవన్‌కు వెళ్లి సంబంధిత ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా మెమోరాండం సమర్పించానని మాదే చెప్పారు.

తిన‌డానికి చ‌పాతీ ఇవ్వ‌లేద‌ని రిక్షా కార్మికుడి దారుణ హ‌త్య‌., ఎక్క‌డంటే ?

ఈ సంద‌ర్భంగా య‌న మాట్లాడుతూ ‘‘ ఆ ఉపాధ్యాయుడు ఫిర్యాదురాలి, ఇతర అమ్మాయిలను అవమానించేవాడు. స్నానానికి వేడినీరు, పడుకోవడానికి పరుపు లేకపోవడం వంటి ఇతర ఫిర్యాదులు పాఠశాలలో విద్యార్థుల నుండి ఉన్నాయి. పాఠశాలలో ప్రవేశానికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ (UGP)ని కూడా తప్పనిసరి చేసింది. అయితే, అలాంటి నియమం ఏం లేదు ’’ అని అన్నారు. కాగా.. ఆ పాఠశాలలో మొత్తం 500 మంది బాలికలు చదువుతున్నారు.